Snake | నాగుపాము కాటు నుంచి తృటిలో తప్పించుకున్న చిన్నారి
విధాత: ఇంటి కడపకు ఇంచు దూరంలో ఓ నాగుపాము (Snake) బుసలు కొడుతూ.. ఇంట్లోకి వెళ్లేందుకు యత్నిస్తోంది. అప్పుడే మెట్లపై నుంచి తన ఇంట్లోకి ప్రవేశిస్తున్న బాలిక.. ఆ నాగుపామును గమనించలేదు. ఇంట్లోకి కాలు పెట్టే సమయంలో పాపను కాటేసేందుకు పాము యత్నించింది. కుటుంబ సభ్యులు అప్రమత్తం చేయడంతో చిన్నారి ఇంట్లోకి పరుగెత్తింది. ఈ ఘటన కర్ణాటక బెలగావిలోని హలగా గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ చిన్నారి తన ఇంట్లోకి మెట్లపై నుంచి పరుగెత్తుకుంటూ […]

విధాత: ఇంటి కడపకు ఇంచు దూరంలో ఓ నాగుపాము (Snake) బుసలు కొడుతూ.. ఇంట్లోకి వెళ్లేందుకు యత్నిస్తోంది. అప్పుడే మెట్లపై నుంచి తన ఇంట్లోకి ప్రవేశిస్తున్న బాలిక.. ఆ నాగుపామును గమనించలేదు. ఇంట్లోకి కాలు పెట్టే సమయంలో పాపను కాటేసేందుకు పాము యత్నించింది.
కుటుంబ సభ్యులు అప్రమత్తం చేయడంతో చిన్నారి ఇంట్లోకి పరుగెత్తింది. ఈ ఘటన కర్ణాటక బెలగావిలోని హలగా గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ చిన్నారి తన ఇంట్లోకి మెట్లపై నుంచి పరుగెత్తుకుంటూ వచ్చింది.
అప్పటికే ఆ ఇంటి గడపకు ఇంచు దూరంలో నాగుపాము ఉంది. అది బుసలు కొడుతూ.. ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నిస్తోంది. అయితే ఆ చిన్నారి పామును గమనించకుండా ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించింది.
అయితే ఒక్కసారిగా పాము పడగ విప్పి పాపను కాటేసేందుకు యత్నించింది. ఆందోళనకు గురైన చిన్నారి.. వెనుకకు వచ్చింది. కుటుంబ సభ్యుల అప్రమత్తతో మళ్లీ ఇంట్లోకి బాలిక పరుగెత్తి పాము కాటు నుంచి తృటిలో తప్పించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.