Solar Eclipse | ఈ నెల 20న తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుతున్నది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.29 గంటల వరకు కొనసాగనున్నది. అయితే, ఈ గ్రహణం భారత్లో మాత్రం కనిపించదు. దాంతో సూతకకాలం ఉందని జ్యోతిష్య పండితులు పేర్కొన్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆగ్నేయ ఆసియా, అంటార్కిటికా, దక్షిణ హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో మాత్రమే కనిపించనున్నది. ఈ ఏడాది నాలుగు గ్రహణాలు కనువిందు చేయనున్నాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు, మిగతా రెండు చంద్రగ్రహణాలు. […]
Solar Eclipse | ఈ నెల 20న తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుతున్నది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.29 గంటల వరకు కొనసాగనున్నది. అయితే, ఈ గ్రహణం భారత్లో మాత్రం కనిపించదు. దాంతో సూతకకాలం ఉందని జ్యోతిష్య పండితులు పేర్కొన్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆగ్నేయ ఆసియా, అంటార్కిటికా, దక్షిణ హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో మాత్రమే కనిపించనున్నది.
ఈ ఏడాది నాలుగు గ్రహణాలు కనువిందు చేయనున్నాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు, మిగతా రెండు చంద్రగ్రహణాలు. ఇందులో తొలి సూర్యగ్రహణం ఈ నెల 20న ఏర్పడనున్నది. రెండోది అక్టోబర్ 14న కనిపించబోతున్నది. చంద్రగ్రహణాలు మే5న, అక్టోబర్ 28న కనిపించనున్నాయి. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చిన సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో భూమిపై సూర్యుడు పూర్తిగా.. లేదంటే పాక్షికంగా కనిపించడు.