మీరంతా నా హృదయానికి చాలా ద‌గ్గ‌ర‌గా: సోనియా గాంధీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించుకుని ఉద్యమ కాలంలో మీరు కన్నకలలను నెరవేర్చుకోవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పిలుపునిచ్చారు

  • By: Somu    latest    Nov 28, 2023 11:22 AM IST
మీరంతా నా హృదయానికి చాలా ద‌గ్గ‌ర‌గా: సోనియా గాంధీ
  • అమ‌రుల స్వ‌ప్నాలు పూర్తి అవ‌డం చూడాల‌నుకుంటున్నా…
  • మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయండి
  • ట్విట్ట‌ర్‌లో తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం


విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించుకుని ఉద్యమ కాలంలో మీరు కన్నకలలను నెరవేర్చుకోవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె తెలంగాణ ప్రజలనుద్దేశించి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ కుటుంబ సభ్యులకు సోనియా గాంధీ సందేశం పేరిట లేఖలో వివరాలు ఇలా ఉన్నాయి.


నమస్కారం నా ప్రియమైన సోదరీమణులు, తెలంగాణ సోదరులారా…నేను మీ అందరి మధ్యకు రాలేకపోయాను కానీ మీ హృదయాలకు చాలా దగ్గరయ్యాను. ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ తల్లి అమరులైన పుత్రుల కల నెరవేరేలని కోరుకుంటున్నానని తెలిపారు.


మనమందరం దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని, ఈ ఎన్నికల్లో మీరంతా కాంగ్రెస్‌ను గెలిపించుకుని మీ కలలను నిజం చేసుకోండని కోరారు. మీకు నిజమైన, నిజాయితీ గల ప్రభుత్వాన్ని అందిస్తామన్నారు. మీరు నన్ను సోనియా అమ్మా అని పిలిచి అపారమైన గౌరవం ఇచ్చారని, నన్ను తల్లిలా చూసుకున్న ఈ ప్రేమ, గౌరవానికి నేను ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతగా ఉంటానని, ఎప్పటికీ మీకు అంకితమై ఉంటానన్నారు.


తెలంగాణలోని మన సోదరీమణులు, తల్లులు, కొడుకులు, కుమార్తెలు, సోదరులు ఈసారి తమ శక్తినంతా వినియోగించి మార్పు తీసుకురావాలని అభ్యర్థిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటు వేయండి..మార్పు కావాలి – కాంగ్రెస్ రావాలి అంటు లేఖలో పేర్కోన్నారు.

సోనియా గాంధీ సందేశాన్ని రీట్విట్ చేసిన పీసీసీ చీఫ్ రేవంత్‌

తల్లికి బిడ్డపై ప్రేమ వెలకట్టలేనిద‌ని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏఐసీసీ అగ్ర‌నేత సోనియా గాంధీ ట్విట్‌ను రేవంత్‌రెడ్డి రీట్విట్ చేశారు