సంక్రాంతి పండుగకి 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..! ఏయే మార్గాల్లోనంటే..?

సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు 32 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు పేర్కొంది

సంక్రాంతి పండుగకి 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..! ఏయే మార్గాల్లోనంటే..?

Sankranti Special Trains | సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు 32 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు పేర్కొంది. జనవరి 7 నుంచి 27 మధ్య ఆయా ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. సికింద్రాబాద్‌-బ్రహ్మపూర్‌, విశాఖపట్నం-కర్నూల్‌ సిటీ, కాకినాడటౌన్‌-సికింద్రాబాద్, తిరుపతి – సికింద్రాబాద్‌ తదితర మార్గాల్లో ఈ ప్రత్యేక రూళ్లు నడుస్తాయని తెలిపింది. ఆయా రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.


ఈ రైళ్లు పరుగులు తీసేది ఈ రూట్లలోనే..


సికింద్రాబాద్‌ – బ్రహ్మపూర్‌ (07089) మధ్య ప్రత్యేక రైలు ఈ నెల 7, 14 తేదీల్లో నడువనున్నది. బ్రహ్మాపూర్ నుంచి వికారాబాద్ (07090) ఈ నెల 8, 15 తేదీల్లో, వికారాబాద్-బ్రహ్మపూర్ (07091 ) మధ్య జనవరి 9, 16 తేదీల్లో నడువనున్నది. బ్రహ్మాపూర్-సికింద్రాబాద్ (07092) రైలు ఈ నెల 10, 17న పరుగులు తీయనున్నాయి. విశాఖపట్నం నుంచి కర్నూల్‌ సిటీ (08541) మధ్య ఈ నెల 10, 17, 24వ తేదీల్లో.. కర్నూల్‌ సిటీ నుంచి విశాఖపట్నం (08542) మధ్య ఈ నెల 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. శ్రీకాకుళం-వికారాబాద్ (08547) మధ్య ఈ నెల 12, 19, 26 తేదీల్లో.. వికారాబాద్- శ్రీకాకుళం (08548) మధ్య ఈ నెల 13, 20, 27న పరుగులు తీస్తాయని చెప్పింది.


సికింద్రాబాద్-తిరుపతి (02764) మధ్య ఈ నెల 10, 17 తేదీల్లో.. తిరుపతి -సికింద్రాబాద్ (02763) మధ్య ఈ నెల 11, 18 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పింది. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07271) మధ్య ఈ నెల 12న, కాకినాడ టౌన్-సికింద్రాబాద్ (07272) మధ్య 13న నడువనున్నాయి. సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07093) మధ్య ఈ నెల 8, 15 తేదీల్లో నడువనునండగా.. బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07094) మధ్య 9, 16 తేదీల్లో పరుగులు పెట్టనున్నాయి. నర్సాపూర్ – సికింద్రాబాద్ (07251) మధ్య నెల 10న, సికింద్రాబాద్ – నర్సాపూర్ (07252) మధ్యన 11న ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది.


ఏ రైలు ఎక్కడ ఆగుతుందంటే..


రైలు నంబర్‌ 07089-07090, 07091-07092 ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్చాపురం మధ్య ఆగుతాయని తెలిపింది. 08541-0842 ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం- కర్నూలు సిటీ రైళ్లు దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ, కాచిగూడ, ఉమ్దానగర్ , షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్ స్టేషన్లలో ఆగుఆయని పేర్కొంది. 08547-08548 నంబరు గల శ్రీకాకుళం – వికారాబాద్‌ రైళ్లు పొందూరు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, సింహాచలం, దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి స్టేషన్లలో ఆగనున్నాయి.


సికింద్రాబాద్‌-తిరుపతి (02764-02763) ట్రైన్స్‌ జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగనున్నాయి. సికింద్రాబాద్‌ – కాకినాడ ( 07271) రైలు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట్ స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07272) రైలు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ స్టేషన్ల మీదుగా సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.


సికింద్రాబాద్-బ్రహ్మాపూర్- సికింద్రాబాద్‌ (07093-07094) రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, పి. అన్నవరం, పి. కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం స్టేషన్లు ఇరువైపులా ఆగనున్నాయి. నర్సాపూర్ – సికింద్రాబాద్ (07251) స్పెషల్‌ ట్రైన్‌ పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతాయి. సికింద్రాబాద్ – నర్సాపూర్ (07252) ప్రత్యేక రైలు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతాయని రైల్వేశాఖ వివరించింది.