అర్వింద్‌.. ఆ పెద్దమనిషి కొడుకుగా మాట్లాడు: మంత్రి KTR

నిజామాబాద్‌ అభివృద్ధికి వెయ్యి కోట్లు తీసుకురా.. ఎంపీ అరవింద్‌కు కేటీఆర్ సవాల్ విధాత, నిజామాబాద్: నోరు విప్పితే పచ్చి బూతులు.. 'మాకు కూడా అలాంటి భాష వస్తది' కాని అది తమ సంస్కారం కాదని ఎంపీ అరవింద్ నుద్దేశించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. శనివారం నిజామాబాద్‌ నగరంలో 50 కోట్లతో నిర్మించనున్న ఇందూరు కళాభారతి ఆడిటోరియం భవనానికి శంకుస్థాపనతో పాటు రైల్వే అండర్ గ్రౌండ్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం తెలంగాణ […]

అర్వింద్‌.. ఆ పెద్దమనిషి కొడుకుగా మాట్లాడు: మంత్రి KTR
  • నిజామాబాద్‌ అభివృద్ధికి వెయ్యి కోట్లు తీసుకురా..
  • ఎంపీ అరవింద్‌కు కేటీఆర్ సవాల్

విధాత, నిజామాబాద్: నోరు విప్పితే పచ్చి బూతులు.. ‘మాకు కూడా అలాంటి భాష వస్తది’ కాని అది తమ సంస్కారం కాదని ఎంపీ అరవింద్ నుద్దేశించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. శనివారం నిజామాబాద్‌ నగరంలో 50 కోట్లతో నిర్మించనున్న ఇందూరు కళాభారతి ఆడిటోరియం భవనానికి శంకుస్థాపనతో పాటు రైల్వే అండర్ గ్రౌండ్ ప్రారంభోత్సవం చేశారు.

అనంతరం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీ అరవింద్ పై కేటీఆర్ తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. నిజామాబాదు నగర అభివృద్ధికి ఎనిమిదిన్నర ఏళ్లలో తమ ప్రభుత్వం 936.69 కోట్ల రూపాయలు ఖర్చు చేసింద‌న్నారు. ప్రతిపక్ష పార్టీలకు అనుమానాలు ఎక్కువని ఇందుకు సంబంధించిన వివరాలు ఇక్కడే అందరి వద్ద ఉంటాయని, ఎవరైనా చూడవచ్చ‌న్నారు.

గత నాలుగేళ్లలో ఎంపీ అరవింద్ ఎన్ని నిధులు ప్రత్యేకంగా తెచ్చారని ప్రశ్నించారు. అదనంగా నయా పైసా మంజూరు కాలేదన్నారు. డి శ్రీనివాస్ అంటే తమకు గౌరవం ఉందని, అసభ్య పదజాలంతో మాట్లాడితే తాము అంత కంటే ఎక్కువ మాట్లాడతామని కేటీఆర్ హెచ్చరించారు.

నిజామాబాద్ అభివృద్ధికి వెయ్యి కోట్లు తీసుకురావాలని అరవింద్ కు కేటీఆర్ సవాల్ చేశారు. వచ్చే ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్ చివరిదని, కనీసం ఇప్పుడైనా పసుపు బోర్డు తీసుకు రావాలని, నగర అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ప్రాయచ్చిత్తం చేసుకోవాలని హితవు పలికారు.

ఇకనైనా పెద్దమనిషి కొడుకుగా మాట్లాడాలని సూచించారు. సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, షకీల్, నిజామాబాదు నగర మేయర్ నీతు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.