Supreme Court | భర్తను కర్రతో కొట్టి చంపి.. బతికిపోయింది! హత్య కేసులో మహిళకు శిక్ష తగ్గించిన సుప్రీం కోర్టు

Supreme Court హత్యకు వాడిన ఆయుధం ప్రమాదకరమైంది కాదు కర్రను మారణాయుధంగా పరిగణించలేం హత్య కేసులో మహిళకు శిక్ష తగ్గించిన సుప్రీం కోర్టు చిన్నచిన్న అంశాలపై గొడవలు వద్దని సూచన న్యూఢిల్లీ: తన భర్తను కర్రతో కొట్టి చంపిన కేసులో ఓ మహిళకు సుప్రీం కోర్టు జైలు శిక్ష కాలాన్ని తగ్గించింది. హత్య నేరారోపణను మార్చి.. ఉద్దేశపూర్వకంగా జరుగని హత్యగా మార్చింది. నిర్మల అనే మహిళ తన భర్తను కర్రతో కొట్టడంలో అతను మరణించాడు. ఈ కేసులో […]

Supreme Court | భర్తను కర్రతో కొట్టి చంపి.. బతికిపోయింది! హత్య కేసులో మహిళకు శిక్ష తగ్గించిన సుప్రీం కోర్టు

Supreme Court

  • హత్యకు వాడిన ఆయుధం ప్రమాదకరమైంది కాదు
  • కర్రను మారణాయుధంగా పరిగణించలేం
  • హత్య కేసులో మహిళకు శిక్ష తగ్గించిన సుప్రీం కోర్టు
  • చిన్నచిన్న అంశాలపై గొడవలు వద్దని సూచన

న్యూఢిల్లీ: తన భర్తను కర్రతో కొట్టి చంపిన కేసులో ఓ మహిళకు సుప్రీం కోర్టు జైలు శిక్ష కాలాన్ని తగ్గించింది. హత్య నేరారోపణను మార్చి.. ఉద్దేశపూర్వకంగా జరుగని హత్యగా మార్చింది. నిర్మల అనే మహిళ తన భర్తను కర్రతో కొట్టడంలో అతను మరణించాడు. ఈ కేసులో మహిళ వాడినది మారణాయుధం కాదని కోర్టు పేర్కొన్నది.

‘ఈ నేరంలో వాడిన కర్ర ఆ ఇంట్లో ఉన్నదే. కనుక దానిని మారణాయుధంగా పేర్కొనలేం’ అని సుప్రీం కోర్టు పేర్కొన్నది. వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణ.. ఆమె తన భర్తపై దాడి చేసేందుకు పురికొల్పి ఉండొచ్చని జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ జేబీ పార్దీవాలా ధర్మాసనం అభిప్రాయపడింది. ఇప్పటికే ఈ కేసులో ఆమె 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించినందున.. శిక్షను సవరిస్తూ విడుదలను ప్రసాదించింది.

ఆమె చేసిన నేరానికి ఇప్పటి వరకు అనుభవించిన శిక్ష సరిపోతుందని పేర్కొన్నది. విచారణ కోర్టు తీర్పును హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి కుమార్తెను ఎన్సీసీ క్యాంప్‌నకు పంపేందుకు 500 ఇవ్వాలని భర్తను కోరితే అతడు తిరస్కరించాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. చేతికి అందిన కర్రతో తన భర్తను కొట్టగా.. అతడు మరణించాడు. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

చాలా చిన్న చిన్న విషయాల్లో గొడవలు కుటుంబాల్లో కలుషిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని పేర్కొన్నది. ఈ కేసులో భర్త తన భార్య కాలు విరగ్గొట్టాడని, ఈ కోపంలోనే భర్తకు గుణపాఠం చెప్పాలని మహిళ ప్రయత్నించి ఉండొచ్చని పేర్కొన్నది. అయితే.. దురదృష్టవశాత్తూ భార్య కర్రతో కొట్టడంతో చనిపోయాడని పేర్కొన్నది.