Summer | సుర్రుమంటున్న సూరీడు.. భానుడి ఉగ్రరూపానికి జనం బెంబేలు

భానుడి ప్రతాపం.. పిల్లలపై ప్రభావం పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ఉమ్మడి మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో 43 డిగ్రీలు మ‌రో 3, 4 రోజులలో మరింత పెరుగనున్న ఉష్ణోగ్రతలు పిల్లల ప్రాణాలను తీస్తున్న ఈత కన్నవాళ్లకు కడుపు కోత.. తీరని వ్యథ జలపాతాలు, చెరువులు, వాగులు సందర్శించే ప్రాంతాల్లో పొంచి ఉన్న ముప్పు ఏమరుపాటుగా ఉంటే మొదటికే మోసం తల్లిదండ్రులారా తస్మాత్ జాగ్రత్త..! పిల్లలపై కన్నేసి ఉంచండి.. వారి ప్రాణాలను కాపాడండి. విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా […]

Summer | సుర్రుమంటున్న సూరీడు.. భానుడి ఉగ్రరూపానికి జనం బెంబేలు
  • భానుడి ప్రతాపం.. పిల్లలపై ప్రభావం
  • పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
  • ఉమ్మడి మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో 43 డిగ్రీలు
  • మ‌రో 3, 4 రోజులలో మరింత పెరుగనున్న ఉష్ణోగ్రతలు
  • పిల్లల ప్రాణాలను తీస్తున్న ఈత
  • కన్నవాళ్లకు కడుపు కోత.. తీరని వ్యథ
  • జలపాతాలు, చెరువులు, వాగులు సందర్శించే ప్రాంతాల్లో పొంచి ఉన్న ముప్పు
  • ఏమరుపాటుగా ఉంటే మొదటికే మోసం
  • తల్లిదండ్రులారా తస్మాత్ జాగ్రత్త..!
  • పిల్లలపై కన్నేసి ఉంచండి.. వారి ప్రాణాలను కాపాడండి.

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: వేసవి కాలం వచ్చేసింది. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుతున్నాయి. మూడు, నాలుగు రోజులుగా పగలు, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మెదక్ ఉమ్మడి జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలకు చేరుకుంది. సిద్దిపేట జిల్లాల్లో బుదవారం రోజు 42 నుండి 43 డిగ్రీ ల ఉష్ణోగ్రతలకు చేరుకుంది మెదక్, సంగారెడ్డి జిల్లాలో సైతం 43 డిగ్రీలు దాటింది. వచ్చే 2, 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణశాఖ అధికారులు చెపుతున్నారు.

ఈ సారి ముందస్తుగానే ఎండలు ప్రభావం చూపుతుండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడంతో జనాలు ఏసీలు, కూలర్లకు పనిచెబుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఎండ తీవ్రత కనిపిస్తోంది.
వేసవిలో సమస్యలు ఎన్నో వేసవిలో సీజనల్ వ్యాధులకు తోడు వేడితో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే వాటిని జయించవచ్చున‌ని వైద్యులు తెలిపారు.

చర్మ సంబంధిత వ్యాధులు, కళ్లు, గుండెపోటు సమస్యలు, వడదెబ్బ, డీహైడ్రేషన్, సన్బార్న్ ముప్పు, పిల్లలో రోటా వైరస్ వంటివి కినిపిస్తాయి. వేసవిలో అపరిశుభ్రమైన నీరు చెడిపోయిన ఆహార పదార్థాలు అరోగ్యానికి నష్టం కలిగిస్తాయి. ప్రస్తుతం మార్చిలోనే 40 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు దాటిపోయే అవకాశం కనిపిస్తోంది. ఎండ వేడితో హైపర్ థెర్మియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరానికి చల్లగా గాలి తగిలే విధంగా తేలికపాటి వస్త్రాలు ధరించాలి. వడదెబ్బ తగలకుండా సీజనల్ ప్రూట్స్ తీసుకోవాలి.

చిన్నారులు జాగ్రత్త

వేసవిలో పిల్లలకు ఒంటి పూట బడులు, సెలవులు ఇస్తారు. దీంతో పిల్లలు ఎక్కువగా ఎండలో అటలు అడుతుంటారు. వారిపట్ల పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో డస్ట్ అలర్జీ కనిపిస్తుంది. జలుబు, దగ్గు ఎక్కువగా వస్తాయి. చెమట పొక్కులు, ఫంగస్, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. స్కూల్‌కు వెళ్లే చిన్నారుల్లో ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. సీజన్ మారినప్పుడు ఉష్ణోగ్రతకు అనుగుణంగా వైరస్ మారుతుది. ఆ ప్రకారం రోగనిరోధక శక్తి పెరగడానికి పట్టే సమయంలో పిల్లలపై వ్యాధులు దాడి చేస్తాయి.

సరదాగా మొదలై విషాదం వైపు

సాధారణంగా ఈతకు వెళ్లే పిల్లల మానసిక స్థితి ఇలా ఉంటుంది. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఈతకు వెళ్లాం కదా.. ఇప్పుడు వెళ్తే ఏమవుతుంది.. నా వెంట ఈత వచ్చిన వాళ్లు చాలా మంది ఉన్నారు కదా.. వాళ్లుండగా ప్రమాదం ఎందుకు ఎదురవుతుంది.. ఈతకు వెళ్తామని అమ్మనాన్నకు చెప్తే తిడతారు. వాళ్లకు చెప్పొద్దు. ఇలా వెళ్లి అలా ఇంటికి తిరిగి వచ్చేద్దాం.. వేసవి సెలవుల్లో తప్పితే ఎప్పుడు ఈతకు వెళ్తాం. సెలవులు అయిపోతున్నాయి కదా.. ఇప్పటికైనా వెళ్లకపోతే ఎలా.. ఇలా తమకు తామే సమాధానం చెపుకుంటూ స్నేహితులంతా చెరువులు లేదా సమీపంలోని నదులు లేదా పంట కాలువల వద్దకు వెళ్తున్నారు.

ఈత‌కు వెళ్లే వారిపై క‌న్నేయాలి

జిల్లాల్లో నిత్యం జల వనరుల వద్ద ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ ప్రాంతంలో ప్రమాదం పొంచి ఉందో గుర్తించి అక్కడికి వెళ్లకుండా అప్రమత్తం చేసేలా హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలి. ఊహించని రీతిలో, ఆపదలో చిక్కుకుంటే ఎలా ఒడ్డుకు చేరాలి అనే అంశంపై ప్రచారం చేసే వ్యవస్థలు లేవు. ఏదైనా ఘటన జరిగితే అధికారులు హడావుడి చేస్తున్నారు. తర్వాత అంతా మరిచిపోతున్నారు. శాశ్వత చర్యలు లేవు. జలగండాలపై అప్రమత్తం చేయడం లేదు.

జిల్లాలో అన్ని మండలంలోని ప్రాజెక్టు, గుండాల ప్రాంతంలోని ఏడుపాయల ప్రాంతాల వద్ద ఎక్కువ మంది గల్లంతై మృత్యువాత పడ్డారు. యాత్రలోనూ అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రాజెక్టులు, ఊర్ల చివ‌ర‌ల్లోని చెరువుల్లో ఈత కై వెళ్లి మరణాలు సంభవించాయి. తల్లిదండ్రులు పిల్లలకు కచ్చితంగా ఈత నేర్పాలి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రీడాప్రాంగణాల్లో స్విమ్మింగ్ పూల్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వ్యాయామ ఉపాధ్యాయులు పిల్లలకు ఆటలతో పాటు ఈత నేర్పించాలి. ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకునేందుకైనా ఈత ఉపయోగపడుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ..

వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లలను కదలికలను గమనించాలి. సమీపంలో చెరువులు, నదులు ఉంటే వాటి వద్దకు వెళ్లవద్దని ముందుగానే చెప్పాలి. ఈతకు ప్రేరేపిస్తున్న స్నేహితులను గుర్తించాలి. వారికీ నచ్చజెప్పాలి. అవసరమైతే వారికి దూరంగా ఇతర పిల్లలను ఉంచాలి. సుశిక్షితులైన శిక్షకులు నడుపుతున్న స్విమ్మింగ్ పూల్స్లోనే పిల్లలకు ఈత నేర్పించాలి. లైఫ్ జాకెట్స్ ధరించే పిల్లలు ఈత నేర్చుకునేలా జాగ్రత్త వహించాలి. బోటు షికారుకు వెళ్లినప్పుడు ప్రతిఒక్కరూ కచ్చితంగా లైఫ్ జాకెట్లు ధరించాలి.

తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలి..

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లలు చుట్టపక్కన ఉన్న చెరువుల్లో ఈత కొట్టడానికి ఆసక్తికనబరుస్తారు. తోటి స్నేహితులతో కలిసి వెళ్తారు. తల్లిదండ్రులు పిల్లలను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి. వారిని నీటి జోలికి వెళ్లకుండా కట్టడి చేయాలి. వారికి స్విమ్మింగ్ పూల్స్లోనే ఈత నేర్పించాలి. నిపుణులు, శిక్షకులు లేనిదే వారిని నీళ్ల వద్దకు వెళ్లనీయకూడదు.

చెరువులు, నదుల వద్ద బారికెడ్లు ఉండాలి…

ప్రమాద ఘటనలు జరుగుతున్న చెరువులు, న దుల ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు బారికెడ్లు ఏ ర్పాటు చేయాలి. అవసరమైతే హెచ్చరిక బోర్డులు పెట్టాలి. పిల్లలు స్విమ్మింగ్ పూల్స్లోనే ఈత నే ర్చుకోవాలి. లైఫ్ జాకెట్స్ ధరించాలి. తల్లిదండ్రు లు పిల్లలకు కచ్చితంగా ఈత నేర్పించాలి. ఈత జీవితంలో ఏదో ఒక సమయంలో మన ప్రాణాలను కాపాడుతుందని గుర్తించాలి.

అప్రమత్తంగా ఉండాలి

జలపాతాలు, ఇతర నీటి వనరుల వద్దకు వెళ్లిన సందర్భంలో సందర్శకులు అప్రమత్తంగా ఉండాలి. సెల్ఫీ కోసం నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకూడదు. ప్రమాదకరంగా ఉన్న గుట్టలు, కొండలు ఎక్కేందుకు ప్రయత్నించొద్దు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన చోట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఒంటరిగా పర్యాటక ప్రదేశాలకు పంపవద్దు.