ఇది కదా సూర్య అంటే.. యాక్సిడెంట్‌లో మృతి చెందిన అభిమాని ఇంటికి వెళ్లి ఓదార్పు

  • By: sn    latest    Sep 29, 2023 3:42 AM IST
ఇది కదా సూర్య అంటే.. యాక్సిడెంట్‌లో మృతి చెందిన అభిమాని ఇంటికి వెళ్లి ఓదార్పు

త‌మిళ న‌టుడు సూర్య త‌మిళ ప్రేక్ష‌కుల‌తో పాటు తెలుగు ప్రేక్ష‌కులకి కూడా చాలా సుప‌రిచితం. ఆయ‌న సినిమాల క‌న్నా త‌న మంచి మ‌న‌సుతో ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకున్నాడు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా నిలబడడం, ముఖ్యంగా మహిళలకు గౌరవం ఇవ్వడం, చిన్న పిల్లలను, అనాధ పిల్లలను చదివించడం వంటి ఎన్నో మంచి ప‌నులు చేసి సూర్య అభిమానుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. సూర్య త‌మిళ హీరో అయిన తెలుగు హీరోలా మారాడు. ఆయ‌న పుట్టిన రోజున మ‌న ద‌గ్గ‌ర కూడా కటౌట్స్ కట్టి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేస్తూ తెగ సంద‌డి చేస్తుంటారు. ఈ ఏడాది సూర్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా క‌టౌట్స్ క‌ట్ట‌బోయి ఇద్ద‌రు అభిమానులు క‌రెంట్ షాక్‌తో క‌న్నుమూసారు. అది తెలుసుకున్న సూర్య ఆ కుటుంబాల‌కి తాను అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.

ఇక తాజాగా త‌న అభిమాని ఒకరు యాక్సిడెంట్‌లో క‌న్నుమూసారు. చెన్నైలోని ఎన్నూర్ లో నివాసం ఉంటున్న అరవింద్ అనే వ్య‌క్తి సూర్య‌కి వీరాభిమాని కాగా, ఆయ‌న ఫ్యాన్ క్ల‌బ్‌లో స‌భ్యుడిగా ఉన్నారు. సూర్య సినిమాలు, బర్త్ డేలకు, ఇతర ఫంక్షన్లను ఎంతో సంతోషంగా సెల‌బ్రేట్ చేసే అర‌వింద్ ఇటీవ‌ల జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో కన్నుమూసారు. ఇది తెలిసి సూర్య స్వ‌యంగా వారి ఇంటికి వెళ్లి త‌ల్లిదండ్రుల‌ని ఓదార్చారు. అరవింద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘ‌న నివాళులు అర్పించారు. అరవింద్ లేని లోటును తాను తీరుస్తానని, ఎలాంటి సాయం కావాల‌న్నా కూడా తాను అండ‌గా ఉంటాన‌ని సూర్య ధైర్యం చెప్పాడు. అరవింద్‌కి సూర్య నివాళులు అర్పించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

సూర్య‌కి సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘సూర్య రియల్ హీరో’ అంటూ ప్ర‌శంస‌ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఇటీవ‌ల సూర్య‌ లేడీ ఫ్యాన్ యూఎస్‌లో జరిగిన కాల్పుల్లో మరణించింది. అప్పుడూ సూర్య వారి తల్లిదండ్రులను ఓదార్చుతూ స్వ‌యంగా లేఖ రాసి వారికి త‌న వంతు ధైర్యాన్ని అందించారు. ఇలా సూర్య ఎప్ప‌టిక‌ప్పుడు మంచి మ‌న‌సు చాటుకుంటూనే ఉంటారు.ఇక సూర్య సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న కంగువా అనే పీరియాడికల్ పాన్ పాండియా మూవీ చేస్తున్నారు. తమిళ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సూర్య డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు. సుమారు 10 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.