Site icon vidhaatha

Suryapet: MP ఉత్తమ్ ఇఫ్తార్ విందు.. హాజ‌రైన‌ అజారుద్దీన్, నదీమ్

విధాత: సూర్యాపేట జిల్లా రఘునాథ‌పాలెంలో పిసిసి మాజీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, AICC సెక్రటరీ నదీమ్ జావేద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సంక్షేమానికి మొదటి నుంచి కట్టుబడి పని చేస్తుందన్నారు. మైనారిటీల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ చేస్తున్న కృషిలో అంతా భాగస్వామ్యం కావాలన్నారు.

Exit mobile version