Syed Sohel | రీ రిలీజ్.. ఈ ‘మిస్టర్ ప్రెగ్నెంగ్’ హీరో గోడు పట్టించుకునేదెవరు?
Syed Sohel | చిన్న సినిమా ఎప్పుడూ బ్రతకాలన్నా.. దానికి చాలా కలిసిరావాలి. ఈమధ్య కాలంలో వచ్చిన ‘బేబి’ సినిమాతో మళ్ళీ చిన్న సినిమా బ్రతుకుతుందనే ఆశలు చిగురించాయి. అదే కోవలో రిలీజ్ అయిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి బిగ్ బాస్ ఫేమ్, హీరో సయ్యద్ సొహైల్ రియాన్ మాట్లాడుతూ చిన్న సినిమాను బతికించండి.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఎందుకలా […]

Syed Sohel |
చిన్న సినిమా ఎప్పుడూ బ్రతకాలన్నా.. దానికి చాలా కలిసిరావాలి. ఈమధ్య కాలంలో వచ్చిన ‘బేబి’ సినిమాతో మళ్ళీ చిన్న సినిమా బ్రతుకుతుందనే ఆశలు చిగురించాయి. అదే కోవలో రిలీజ్ అయిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి బిగ్ బాస్ ఫేమ్, హీరో సయ్యద్ సొహైల్ రియాన్ మాట్లాడుతూ చిన్న సినిమాను బతికించండి.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఎందుకలా అనాల్సి వచ్చిందనేదానికి పెద్ద విషయమే ఉంది. ఆ విషయంలోకి వెళితే..
రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని, ప్రేక్షకుల మన్ననలను అందుకుంటోంది. ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్‌లో కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటితో అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో హీరో సోహైల్ తన పదహారేళ్ళ కష్టాన్ని ఈ సినిమా చెరిపేసిందని, విజయాన్ని అందుకున్నానని సంతోషంగా చెప్పుకొచ్చాడు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ రివ్వూస్‌లో సోహైల్ నటన బావుందని అంతా రాయడం కూడా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపాడు.
సినిమాని థియేటర్‌కి వెళ్ళి చూసి వస్తున్నప్పుడు ప్రేక్షకులు హగ్ చేసుకుని నా నటన బావుందనడం మంచి అనుభూతిని ఇచ్చిందని సంతోషంగా చెప్పుకొచ్చాడు సొహైల్. ఒక మంచి సినిమా చేశామని తృప్తి ఉంది. ఎక్కడా నెగిటివ్ టాక్ రాలేదు. కానీ యూట్యూబ్‌లో మాత్రం నెగిటివ్ కామెంట్స్‌తో సినిమాని దెబ్బ తీసే విధంగా పోస్ట్ చేస్తున్నారు. ఎంతో మంది కష్టంతో ఒక సినిమా రూపు దిద్దుకుంటుంది. అలాంటిది చిన్న కామెంట్, అంత కష్టాన్ని తుడిచేస్తుంది. ఎంతో నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇది కాస్త గుర్తు పెట్టుకుంటే చాలామందికి సాయపడినవాళ్ళు అవుతారని చెప్పుకొచ్చాడు సొహైల్.
ఇక ఈమధ్య కాలంలో ఒకప్పుడు సినిమాలను మళ్ళీ తెరమీద రిలీజ్ చేస్తున్న విషయాన్ని కూడా సొహైల్ ప్రస్తావించాడు. పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు మళ్ళీ తెర మీద రిలీజ్ చేయడం బావుంది కానీ వాటిని మిగతా సినిమా కలెక్షన్స్ దెబ్బతినే విధంగా వీకెండ్స్ కాకుండా వారం మధ్యలో రిలీజ్ చేయడం వల్ల చిన్న సినిమాలు బ్రతుకుతాయని, ఇది నా విజ్ఞప్తిగా తీసుకోవాలని సినీ దిగ్గజ నిర్మాతలు, పంపిణీ దారులకు తెలియజేశాడు.
మరి సొహైల్ చెప్పిన విధంగా నిర్మాతలు, పంపిణీ దారులు వీక్ మధ్యలో సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు చూస్తారో లేదో వేచి చూడాల్సిందే. అయినా విడుదల చేస్తున్నవన్నీ పెద్ద హీరోల సినిమాలే.. అలాంటప్పుడు.. చిన్న సినిమాలను ఎవరు పట్టించుకుంటారు. అందులోనూ ఫ్యాన్స్ కోరి మరీ రీ రిలీజ్ చేసుకుంటున్నారు. వాళ్లకి సమయం దొరికేది కూడా వీకెండ్స్‌లోనే. మరి సొహైల్ మాటని పట్టించుకునేవారెవరు?