IND VS NZ T20: మిచెల్ విధ్వంసం.. కాన్వే నిలకడ
తొలి టీ20లో 176 పరుగుల భారీస్కోరు చేసిన కివీస్.. ఆఖరి ఓవర్లో 27 పరుగులతో మిచెల్ సంచలన బ్యాటింగ్.. స్పిన్నర్లు రాణించినా.. తుస్సుమన్న భారత పేస్ యూనిట్.. రాంచీ: తొలి టీ20లో కివీస్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 176 పరుగుల స్కోరు చేసి భారత్ ముందు 177 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపింది. కివీస్ ఇన్నింగ్స్ లో డెవాన్ కాన్వే (52 పరుగులు, 35 బంతుల్లో 7 […]

- తొలి టీ20లో 176 పరుగుల భారీస్కోరు చేసిన కివీస్..
- ఆఖరి ఓవర్లో 27 పరుగులతో మిచెల్ సంచలన బ్యాటింగ్..
- స్పిన్నర్లు రాణించినా.. తుస్సుమన్న భారత పేస్ యూనిట్..
రాంచీ: తొలి టీ20లో కివీస్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 176 పరుగుల స్కోరు చేసి భారత్ ముందు 177 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపింది. కివీస్ ఇన్నింగ్స్ లో డెవాన్ కాన్వే (52 పరుగులు, 35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ ), చివరలో డారిల్ మిచెల్ (59 పరుగులు, 30 బంతుల్లో 3ఫోర్లు, 5 సిక్సర్లు) ఆఖరి ఓవర్లో 27 పరుగులతో పెను విధ్వంసంతో భారీ స్కోరు అందించాడు.
తొలుత పవర్ ప్లేలో ఓపెనర్ ఫిన్ అలెన్(35 పరుగులు, 23 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు) పవర్ చూపించాడు. ఈ తరుణంలో బౌలింగ్ కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ వరుసగా అలెన్ సహా మార్క్ చాప్ మన్ ను డకౌట్ గా డగౌట్ కు పంపి స్కోరు వేగానికి కళ్లెం వేశాడు.
వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి అద్భుతంగా రాణించాడు. వీరిద్దరు మినహా భారత పేసర్లు తేలిపోయారు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 51 పరుగులిచ్చి మరోసారి ఎక్స్ పెన్సివ్ గా మిగిలాడు.
డెత్ ఓవర్లలో తడబాటుతో నో బాల్స్ వేయడం ఈ మ్యాచ్ లోనూ అర్షదీప్ కంటిన్యూ చేయడంతో మిచెల్ ఆఖరి ఓవర్లో 27 పరుగులు బాదాడు. స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై భారత్ 177 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.