Ramagundam | BRS అసమ్మతి నేతలపై చర్యలు తీసుకోండి..

Ramagundam ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం విధాత బ్యూరో, కరీంనగర్: పార్టీలో అసమ్మతి గళాలు పెరిగిపోవడం, మరికొందరు అదే బాటలు ఎంచుకోవడానికి సిద్ధం అవుతుండడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రయత్నాలు ఆరంభించారు. సోమవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. అసమ్మతి నేతలపై చర్యలు తీసుకోవాలంటూ అధిష్టానానికి నివేదించే ప్రయత్నం చేస్తున్నారు. రామగుండం బీఆర్ఎస్‌లో అసమ్మతి నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ విస్తృత స్థాయి సమావేశం […]

Ramagundam | BRS అసమ్మతి నేతలపై చర్యలు తీసుకోండి..

Ramagundam

  • ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం

విధాత బ్యూరో, కరీంనగర్: పార్టీలో అసమ్మతి గళాలు పెరిగిపోవడం, మరికొందరు అదే బాటలు ఎంచుకోవడానికి సిద్ధం అవుతుండడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రయత్నాలు ఆరంభించారు. సోమవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. అసమ్మతి నేతలపై చర్యలు తీసుకోవాలంటూ అధిష్టానానికి నివేదించే ప్రయత్నం చేస్తున్నారు.

రామగుండం బీఆర్ఎస్‌లో అసమ్మతి నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. అటు శాసనసభ్యునికి, ఇటు పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ, ఏకంగా పోటీయాత్రలు ప్రారంభించిన నేతలను బీఆర్ఎస్ నుండి తొలగించాలని రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేసింది.

ఎమ్మెల్యే కోరుకొండ చందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు పి.టి.స్వామి, సభ్యులు తోడేటి శంకర్ గౌడ్, నారాయణ, ఎర్రం స్వామితో పాటు కార్పోరేటర్లు, పట్టణ అధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యా రాణి, కార్పోరేటర్ పాతిపెల్లి లక్ష్మి ఎల్లయ్య, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, కేశోరాం సిమెంట్ కర్మాగారం కార్మిక సంఘం అధ్యక్షుడు బయ్యపు మనోహర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని సమావేశానికి హాజరైన సభ్యులు అభిప్రాయపడ్డారు.

శాసనసభ్యుడు కోరుకంటి చందర్ కృషి వలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజ్, సీనియర్ సివిల్ కోర్టు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులుగా కోరుకంటి చందర్ పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తున్నారని అలాంటి వ్యక్తిపై నిందలు వేసి, అపోహలు సృష్టించి బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగిస్తున్న నేతలను పార్టీ నుండి తొలగించాలని అధిష్టాన వర్గాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. తీర్మానం ప్రతిని వారు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పంపించాలని కోరుతూ ఎమ్మెల్యే చందర‌ర్‌కు అందజేశారు.