Tamil Nadu | మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్టు.. బోరున విల‌పించిన మంత్రి

Tamil Nadu | మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్టు అయిన త‌మిళ‌నాడు విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ బోరున విల‌పించారు. నిన్న త‌మిళ‌నాడు స‌చివాల‌యంలోని బాలాజీ కార్యాల‌యంతో పాటు చెన్నైలోని ఆయ‌న నివాసంలోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) అధికారులు సోదాలు నిర్వ‌హించారు. సోదాలు ముగిసిన అనంత‌రం మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత మంత్రి సెంథిల్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంట‌ల పాటు ప్ర‌శ్నించిన త‌ర్వాత బుధ‌వారం ఉద‌యం సెంథిల్‌ను అరెస్టు చేశారు. త‌ద‌నంత‌రం వైద్య ప‌రీక్ష‌ల […]

Tamil Nadu | మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్టు.. బోరున విల‌పించిన మంత్రి

Tamil Nadu |

మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్టు అయిన త‌మిళ‌నాడు విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ బోరున విల‌పించారు. నిన్న త‌మిళ‌నాడు స‌చివాల‌యంలోని బాలాజీ కార్యాల‌యంతో పాటు చెన్నైలోని ఆయ‌న నివాసంలోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) అధికారులు సోదాలు నిర్వ‌హించారు.

సోదాలు ముగిసిన అనంత‌రం మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత మంత్రి సెంథిల్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంట‌ల పాటు ప్ర‌శ్నించిన త‌ర్వాత బుధ‌వారం ఉద‌యం సెంథిల్‌ను అరెస్టు చేశారు. త‌ద‌నంత‌రం వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం సెంథిల్ బాలాజీని చెన్నైలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అప్ప‌టికే అనారోగ్యంతో ఉన్న మంత్రి బాలాజీ.. ఆస్ప‌త్రికి తీసుకొచ్చే స‌మ‌యానికి ఛాతీలో నొప్పి వ‌స్తుందంటూ బోరున విల‌పించారు. తీవ్రంగా విల‌పిస్తున్న సెంథిల్‌ను పోలీసులు ఆస్ప‌త్రి లోప‌లికి తీసుకెళ్లారు.

ఈడీ విచార‌ణ స‌మ‌యంలో మంత్రి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని, ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ఏ మాత్రం బాగాలేద‌ని డీఎంకే రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎన్ ఆర్ ఇలంగో మీడియాకు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం సెంథిల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సెంథిల్‌ను త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ ప‌రామ‌ర్శించారు.

గ‌తంలో అన్నాడీఎంకే పార్టీలో ఉన్న సెంథిల్.. దివంగ‌త జ‌య‌ల‌లిత ప్ర‌భుత్వంలో ర‌వాణా శాఖ మంత్రిగా ప‌ని చేశారు. అయితే ఆ స‌మ‌యంలో ర‌వాణా శాఖ‌లోని ఉద్యోగ నియామ‌కాల్లో అక్ర‌మాలు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఈడీ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టింది.