Rohit Reddy | ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఓవరాక్షన్‌.. భద్రతా సిబ్బందితో రీల్స్‌

Rohit Reddy అతిరుద్ర యాగంలోనూ అపశృతి తాండూర్‌: తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తన గన్‌మెన్‌లు, వై.సెక్యురిటీ సిబ్బందితో చేసిన వీడియో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, భద్రతా సిబ్బందితో వీడియో షూట్స్ చేసిన ఎమ్మెల్యే తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్‌రెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచింది. అయితే రోహిత్ తనకు ప్రభుత్వం కల్పించిన భధ్రత సిబ్బందితో వీడియో ఫోటో షూట్స్ చేయడం ఏమిటంటు.. ఎమ్మెల్యే ఓవరాక్షన్‌కు ఈ చర్య […]

Rohit Reddy | ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఓవరాక్షన్‌.. భద్రతా సిబ్బందితో రీల్స్‌

Rohit Reddy

  • అతిరుద్ర యాగంలోనూ అపశృతి

తాండూర్‌: తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తన గన్‌మెన్‌లు, వై.సెక్యురిటీ సిబ్బందితో చేసిన వీడియో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, భద్రతా సిబ్బందితో వీడియో షూట్స్ చేసిన ఎమ్మెల్యే తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్‌రెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచింది.

అయితే రోహిత్ తనకు ప్రభుత్వం కల్పించిన భధ్రత సిబ్బందితో వీడియో ఫోటో షూట్స్ చేయడం ఏమిటంటు.. ఎమ్మెల్యే ఓవరాక్షన్‌కు ఈ చర్య నిదర్శనమంటు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై స్పందించిన రోహిత్‌రెడ్డి స్నాప్‌చాట్‌లో వచ్చిన వీడియో అదని, దానికి అంత ప్రాధాన్యత అవసరం లేదని, తానేమి ప్రధాని నరేంద్ర మోడీ మాదిరిగా ప్రత్యేక ఫోటో, వీడియో షూట్‌లు చేసుకోలేదంటు వీడియో వివాదాన్ని తెలిగ్గా కొట్టిపారేశారు.

మరోవైపు రోహిత్ రెడ్డి మూడు రోజులుగా నిర్వహిస్తున్న అతిరుద్ర మహా యాగంలో అపశృతి చోటుచేసుకుంది. యాగం చివరి రోజు పూర్ణాహుతిలో మంటలు ఎగిసి హోమగుండాలు, టెంట్లు కాలిబూడిదయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారుర హుటాహుటిన చేరుకుని మంటలు అర్పివేశారు. మంటలు వేగంగా చెలరేగడంతో అక్కడున్న వారంతా పరుగులు తీశారు. ఈ సంఘటలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు.