TDP | కాళహస్తి పంచాయితీ సెటిల్‌.. బొజ్జల, నాయుడు మధ్య కుదిరిన సయోధ్య

TDP | సుధీర్ రెడ్డితో కలిసి ఉండాలని చెప్పిన చంద్రబాబు విధాత‌: చంద్రబాబు చాణక్యం ఫలించింది… శ్రీకాహళస్తి టిడిపిలో ఉన్న చిన్నచిన్న సమస్యలు సమసిపోతున్నాయి. ఇప్పుడు అక్కడ టిడిపి నాయకులంతా సయోధ్యతో ముందుకు సాగేలా చంద్రబాబు వేసిన రూట్ మ్యాప్ మీదుగా నడిచేందుకు అందరూ ఓకే అన్నారు. ఇక అది సత్ఫలితాలు ఇస్తుందా లేదా అన్నది చూడాలి. టిడిపిలో చేరాలనుకుంటున్న NCV నాయుడు ని పిలిపించిన చంద్రబాబు ఇక ముందు బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి పని […]

  • Publish Date - June 20, 2023 / 10:38 AM IST

TDP |

  • సుధీర్ రెడ్డితో కలిసి ఉండాలని చెప్పిన చంద్రబాబు

విధాత‌: చంద్రబాబు చాణక్యం ఫలించింది… శ్రీకాహళస్తి టిడిపిలో ఉన్న చిన్నచిన్న సమస్యలు సమసిపోతున్నాయి. ఇప్పుడు అక్కడ టిడిపి నాయకులంతా సయోధ్యతో ముందుకు సాగేలా చంద్రబాబు వేసిన రూట్ మ్యాప్ మీదుగా నడిచేందుకు అందరూ ఓకే అన్నారు. ఇక అది సత్ఫలితాలు ఇస్తుందా లేదా అన్నది చూడాలి.

టిడిపిలో చేరాలనుకుంటున్న NCV నాయుడు ని పిలిపించిన చంద్రబాబు ఇక ముందు బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి పని చేయాలని, టికెట్ ఆయనకే ఇస్తాం కానీ మున్ముందు మీకు ప్రధాన్యం ఉంటుందని చెప్పి పంపడంతో అక్కడి సమస్యకు పరిష్కారం దొరికినట్లు ఐంది.

ఎస్సీవి నాయుడు 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఆయన టిడిపిలోకి చేరారు. అయినా సీటు ఇవ్వకపోవడంతో ఊరుకుని, 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. కానీ ఇన్నాళ్ళున్నా ఆయనకు పార్టీలో ఎలాంటి గుర్తింపు రాకపోయేసరికి మళ్ళీ టిడిపిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు మొన్నామధ్య టిడిపిలో చేరేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు.

చంద్రబాబు అనుమతులు, ఎపాయింట్మెంట్ సైతం ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే తన క్యాడర్ కు సైతం సమాచారం అందించి మళ్ళీ తాను టిడిపిలోకి వెళ్తున్నట్లు వారికీ చెప్పారు . అయితే ఇన్‌చార్జిని తానూ ఉండగా తనకు కనీసం చెప్పకుండా, తన అంగీకారం లేకుండా నాయుడు మళ్లీ టిడిపిలో చేరడాన్ని ఇష్టపడని సుధీర్ రెడ్డి(మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుమారుడే ఈ సుధీర్ రెడ్డి) తన పవర్ చూపించారు.

నియోజకవర్గ ఇన్‌చార్జిని అయిన తనకు చెప్పకుండా ఎస్సీవీ నాయుడును పార్టీలో ఎలా చేర్చుకుంటారని సుధీర్ రెడ్డి నేరుగా అధిష్టానాన్ని ప్రశ్నించడమే కాకుండా ఒక వాయిస్ మెసేజ్ కూడా విడుదల చేసారు. ఆయన పార్టీలో చేరడానికి అమరావతి వెళితే వాళ్ళని కానీ కార్యకర్తలు ఎవరూ పోవద్దని సుధీర్ రెడ్డి వాయిస్ మెసేజ్ కార్యకర్తలతోబాటు అధిష్టానానికి చేరింది. దీంతో ఈ ఇద్దరి మధ్య సఖ్యత నెలకొల్పేందుకు చర్యలు ప్రారంభించింది.

నిన్న చంద్రబాబు సమక్షంలో రెండు వర్గాలవారూ కూర్చున్నారు. ఈ సందర్బముగా చంద్రబాబు సైతం సుధీర్ రెడ్డికి తన మద్దతు ప్రకటించి ఇకముందు ఆయన సారధ్యంలో పని చేయాలనీ నాయుడిని ఆదేశించారు. శ్రీకాహళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో NCV నాయుడికి మంచి పట్టు ఉంది. దీంతో ఆయన ఇటు సుధీర్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉంటూ పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. త్వరలోనే పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారు.