స్టూడెంట్ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న టీచర్.. వీడియో
Teacher loves student | ప్రేమ గుడ్డిది. ప్రేమించుకోవడానికి వయసుతో సంబంధం లేదు. ఎక్కడంటే ఎక్కడ.. ఎప్పుడంటే అప్పుడు ప్రేమించుకోవచ్చు. ఓ టీచర్ కూడా తన స్టూడెంట్‌పై మనసు పారేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని ఆమెకు చెప్పేశాడు. స్టూడెంట్ కూడా అంగీకరించింది. దీంతో టీచర్, స్టూడెంట్ గత గురువారం మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన ఓ 42 ఏండ్ల సంగీత్ కుమార్ వృత్తిరీత్యా టీచర్. అయితే సొంతంగా ఇంటి వద్ద ఓ […]

Teacher loves student | ప్రేమ గుడ్డిది. ప్రేమించుకోవడానికి వయసుతో సంబంధం లేదు. ఎక్కడంటే ఎక్కడ.. ఎప్పుడంటే అప్పుడు ప్రేమించుకోవచ్చు. ఓ టీచర్ కూడా తన స్టూడెంట్‌పై మనసు పారేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని ఆమెకు చెప్పేశాడు. స్టూడెంట్ కూడా అంగీకరించింది. దీంతో టీచర్, స్టూడెంట్ గత గురువారం మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఒక్కటయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన ఓ 42 ఏండ్ల సంగీత్ కుమార్ వృత్తిరీత్యా టీచర్. అయితే సొంతంగా ఇంటి వద్ద ఓ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆ కోచింగ్ సెంటర్‌కు 20 ఏండ్ల విద్యార్థిని ఇంగ్లీష్ నేర్చుకునేందుకు వచ్చింది. ఈ క్రమంలో టీచర్, విద్యార్థిని శ్వేత కుమారి మధ్య ప్రేమ చిగురించింది. టీచర్ ఆమెకు ప్రపోజ్ చేయడంతో విద్యార్థిని కూడా అంగీకరించింది.
ఇక ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో గురువారం స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో సంగీత్ కుమార్, శ్వేత కుమారి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే సంగీత్ కుమార్‌కు వివాహం కాగా, అతని భార్య కొన్నేండ్ల క్రితం మరణించింది.