ఫిబ్రవరి ౩ నుంచి తెలంగాణ అసెంబ్లీ.. నోటిఫికేషన్‌ విడుదల

ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి విధాత: ఫిబ్రవరి ౩వ తేదీ నుంచి బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల నుద్దేశించి గవర్నర్‌ ౩వ తేదీన అసెంబ్లీ హాల్లో ప్రసగింస్తారని అసెంబ్లీ సెక్రటరీ వి.నరసింహాచార్యులు మంగళవారం గెజిట్‌ విడుదల చేశారు. 2023-2024 వార్షిక బడ్జెట్‌కు గవర్నర్‌ అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో గవర్నర్‌ తరపున అడ్వకేట్ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ […]

  • By: Somu |    latest |    Published on : Jan 31, 2023 9:26 AM IST
ఫిబ్రవరి ౩ నుంచి తెలంగాణ అసెంబ్లీ.. నోటిఫికేషన్‌ విడుదల
  • ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్‌
  • గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి

విధాత: ఫిబ్రవరి ౩వ తేదీ నుంచి బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల నుద్దేశించి గవర్నర్‌ ౩వ తేదీన అసెంబ్లీ హాల్లో ప్రసగింస్తారని అసెంబ్లీ సెక్రటరీ వి.నరసింహాచార్యులు మంగళవారం గెజిట్‌ విడుదల చేశారు.

2023-2024 వార్షిక బడ్జెట్‌కు గవర్నర్‌ అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో గవర్నర్‌ తరపున అడ్వకేట్ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసగించడానికి ఆహ్వానించలేదని తెలిపారు.

దీంతో రాష్ర్ట ప్రభుత్వం వెంటనే బడ్జెట్‌ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్‌ను ఆహ్వానిస్తామని తెలిపింది. అలాగే గవర్నర్‌ బడ్జెట్‌ పద్దులు ప్రవేశ పెట్టడానికి వీలుగా సంతకం చేస్తారని తెలిపారు. దీంతో ఈ కేసును హైకోర్టు కొట్టి వేసింది.

హైకోర్టులో జరిగిన వాదనల మేరకు ప్రభుత్వం, గవర్నర్‌ కార్యాలయం వేగంగా స్పంధించాయి. వెంటనే బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతూ సోమవారం సాయంత్రం గవర్నర్‌ సంతకం చేయగా, ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించడానికి రావాలని కోరుతూ గవర్నర్‌ను రాష్ర్ట ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు గవర్నర్‌ ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించడానికి వస్తానని ప్రభుత్వానికి గవర్నర్‌ తన సమ్మతిని తెలిపింది.

గవర్నర్‌ కార్యాలయం నుంచి వచ్చిన సమ్మతి మేరకు ఉభయ సభలు ఫిబ్రవరి 3వ తేదీన అసెంబ్లీ హాల్‌లో కొలువు దీరుతాయని అసెంబ్లీ కార్యాలయం తెలిపింది.