Telangana BJP | తెలంగాణ బీజేపీని వెంటాడుతున్న అనుమానాలు, అపనమ్మకాలు!
Telangana BJP | మూడో స్థానమే అంటున్న జాతీయ నేత పోటీ చేసే బలం లేని మాట వాస్తవమేనంటున్న ఈటల పార్టీపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అపనమ్మకం తాము అధికారంలోకి రాకున్నా ఫర్వా లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చూడాలన్న లక్ష్యం లిక్కర్ కేసులో కవితను సేవ్ చేసిన బీజేపీ బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కు అనే ప్రచారం విధాత: తెలంగాణ బీజేపీని అనుమానాలు, అపనమ్మకాలు వెంటాడుతున్నాయా అంటే అవుననే సమాధానం రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్నది. బీఆర్‌ఎస్‌ను దించి […]

Telangana BJP |
- మూడో స్థానమే అంటున్న జాతీయ నేత
- పోటీ చేసే బలం లేని మాట వాస్తవమేనంటున్న ఈటల
- పార్టీపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అపనమ్మకం
- తాము అధికారంలోకి రాకున్నా ఫర్వా లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చూడాలన్న లక్ష్యం
- లిక్కర్ కేసులో కవితను సేవ్ చేసిన బీజేపీ
- బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కు అనే ప్రచారం
విధాత: తెలంగాణ బీజేపీని అనుమానాలు, అపనమ్మకాలు వెంటాడుతున్నాయా అంటే అవుననే సమాధానం రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్నది. బీఆర్‌ఎస్‌ను దించి తామే అధికారంలోకి వస్తామని నిన్న మొన్నటి వరకు గంభీరాలు పలికిన బీజేపీ నేతలు తాజాగా మాట మార్చారు. తెలంగాణలో తమది మూడో స్థానమేనని చెప్పకుంటు న్నారు. అంటే తాము ఏమి చేసినా తెలంగాణలో బలపడక పోగా రోజురోజుకు డిఫ్యూజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తన్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
దీంతో తాము అధికారంలోకి రాకపోయినా ఫర్వా లేదు కానీ, దేశంలో తమకు ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకుండా చూడాలన్న లక్ష్యంతో అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. పరోక్షంగా బీజేపీ పార్టీ బీఆర్‌ఎస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా అడుగులేస్తుందన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి.
నేతల మాటలతో..
బీజేపీ నాయకత్వం ఆయా సమాయాలలో మాట్లాడిన మాటలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాడెత్తేసిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఇంచార్జీగా ఉన్నఒక జాతీయ నేత ఇటీవలి కాలంలో ఢిల్లీలో ఒక మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో తమ పార్టీ మూడవ స్థానంలో ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇంతటితో ఆగకుండా తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రావడం తమకు ముఖ్యం కాదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని చెప్పినట్లుగా ఆ మీడియా రాసింది. కాగా బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో తెలంగాణలో కొన్ని సెగ్మెంట్లతో తమ పార్టీకి పోటీ చేసే బలం లేని మాట వాస్తవమేనని అన్నారు.
మరో వైపు కొంతకాలం క్రితం కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ పార్టీ తీరుపై అపనమ్మకం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీపై నమ్మకం లేకపోవడం వల్లనే నాయకులు కొంత మంది నాయకులు బీజేపీలో చేరకుండా ఆగిపోయారని కూడా అన్నారు.
ఇలా బీజేపీ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొంత మంది నేతలు అక్కడక్కడ మాట్లాడుతున్న తీరును పరిశీలిస్తే తెలంగాణలో బీజేపీ కాడెత్తేసినట్లుగానే కపిపిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కు అయినట్లేనా.. జరుగుతున్న పరిణామాలు, బీజేపీ నేతల మాటల తీరు చూస్తే బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు లోపయికారంగా ఒక అవగాహనకు వచ్చినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇటీవల సీఎం కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత పేరుప్రముఖంగా వినిపించింది. ఈ కేసులో ఈడీ గతంలో వేసిన చార్జిషీట్‌లోకవిత పేరు ఉండగా, తాజాగా వేసిన చార్జిషీట్‌లో ఆమె ప్రస్తావన కూడా లేకపోవడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ రెండు పార్టీల పెద్ద మధ్య ఒక అవగాహన కుదిరిన తరువాతనే కవిత పేరు చార్జీషీట్‌లో పేర్కొనలేదన్న చర్చ కూడా జరుగుతున్నది. దీంతో పాటుగా పార్టీలో నేతలు మాట్లాడుతున్న తీరు కూడా దీనిని బలపరుస్తున్నది. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కుమ్మక్కు అయ్యాయన్న చర్చ జరుగుతున్నది.
కాగా పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఇటీవల గాంధీభవన్‌లో నిర్వహించిన ఒకప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. అందుకే ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ల వ్యవహారంపై బీజేపీ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఈ మేరకు కేంద్ర సంస్థలకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదో తెలియజేయాలన్నారు.