Jithender Reddy | ఇక్కడి BJP నేతలకు ఆ ట్రీట్మెంట్‌ కావాలి.. పార్టీలో జితేందర్‌ రెడ్డి ట్వీట్‌ రగడ !

Jithender Reddy | విధాత: బీజేపీలో మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి చేసిన ట్విట్‌ ఆ పార్టీ వర్గాల్లో కాక రేపుతుంది. తెలంగాణ బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్మెంట్ కావాలంటూ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసిన వీడియో ఆ పార్టీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దున్నపోతులను వెనుక నుంచి తన్ని ట్రాలీ వాహనం ఎక్కిస్తున్న వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో ట్విట్‌ కాస్త వైరల్‌గా మారి బీజేపీలో వివాదస్పదంగా మారింది. This […]

Jithender Reddy | ఇక్కడి BJP నేతలకు ఆ ట్రీట్మెంట్‌ కావాలి..  పార్టీలో జితేందర్‌ రెడ్డి ట్వీట్‌ రగడ !

Jithender Reddy |

విధాత: బీజేపీలో మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి చేసిన ట్విట్‌ ఆ పార్టీ వర్గాల్లో కాక రేపుతుంది. తెలంగాణ బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్మెంట్ కావాలంటూ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసిన వీడియో ఆ పార్టీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దున్నపోతులను వెనుక నుంచి తన్ని ట్రాలీ వాహనం ఎక్కిస్తున్న వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో ట్విట్‌ కాస్త వైరల్‌గా మారి బీజేపీలో వివాదస్పదంగా మారింది.


జితేందర్ రెడ్డి తన ట్వీట్ ను అమిత్ షా, బన్సల్, బిఎల్ సంతోష్ లకు ట్యాగ్ చేయడంతో ఈ పరిణామం ఎటు దారి తీస్తుందోనన్న చర్చలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇటీవల బీజేపీ నాయకత్వంలో విబేధాలు నెలకొనడం.. ఈటెల, రాజగోపాల్ రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం వంటి పరిణామాలు ఆ పార్టీ అంతర్గత కలహాలకు నిదర్శనంగా మారాయి. ఇలాంటి తరుణంలో జితేందర్‌డ్డి చేసిన ట్విట్‌ ఆ పార్టీలో మరింత చిచ్చు రేపవచ్చని కేడర్‌లో ఆందోళన వ్యక్తమవుతుంది.

అయితే తన ట్వీట్ పై రేగిన దుమారంపై జితేందర్ రెడ్డి ప్రతిస్పందిస్తూ కేసిఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే… బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే నా ప్రయత్నాన్ని తప్పుగా అర్థం చేసుకునే ఊరకుక్కల్లారా… బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి అంటూ మరో ట్వీట్ చేశారు.

ఇటీవల బీజేపీ నాయకత్వంలో విబేధాలు నెలకొనడం.. ఈటెల, రాజగోపాల్ రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం..బండి నాయకత్వ మార్పుకథనాల వంటి కథనాలు ఆ పార్టీ అంతర్గత కలహాలకు నిదర్శనంగా మారాయి. ఇలాంటి తరుణంలో జితేందర్‌డ్డి చేసిన ట్విట్‌ లు ఆ పార్టీలో మరింత చిచ్చు రేపవచ్చని కేడర్‌ లో ఆందోళన వ్యక్తమవుతుంది.