Telangana Budget | నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. బడ్జెట్‌కు ఆమోదమే ఎజెండా..!

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరుగనున్నది. బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనున్నారు. ఈ సందర్భంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికపై సైతం సమావేశంలో చర్చించనున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. ఈ దఫాలో కేసీఆర్‌ సర్కారు ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్‌ ఇదే కాగా.. ఎన్నికల బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరోసారి భారీ పద్దునే రాష్ట్ర ప్రభుత్వం […]

Telangana Budget | నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. బడ్జెట్‌కు ఆమోదమే ఎజెండా..!

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరుగనున్నది. బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనున్నారు. ఈ సందర్భంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికపై సైతం సమావేశంలో చర్చించనున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. ఈ దఫాలో కేసీఆర్‌ సర్కారు ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్‌ ఇదే కాగా.. ఎన్నికల బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరోసారి భారీ పద్దునే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికం కొనసాగుతుండగా.. మొదటి తొమ్మిది నెలల ఆదాయం, రాబడులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, వచ్చేందుకు అవకాశం మొత్తాన్ని బేరీజువేసుకొని బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం నడుస్తున్న 2022-23 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాతో రూ.2.52లక్షలకోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది 1.93లక్షల రెవెన్యూ రాబడులు అంచనా వేయగా.. డిసెంబర్ చివరి నాటికి అంచనాలకు అనుగుణంగానే ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూరాయి. 2023-24 బడ్జెట్ కోసం అన్ని శాఖలు రూ.3.40లక్షల కోట్ల వరకు ప్రతిపాదించినట్లుగా తెలుస్తున్నది.

శాఖల వారీగా జరిపిన కసరత్తులో ఆ మొత్తాన్ని కుదించినట్లు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడు నెరవేర్చాల్సిన హామీలు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, ఆకాంక్షల అమలు తదితరాలను పరిగణలోకి తీసుకొని బడ్జెట్‌ను కూర్చనున్నది. సంక్షేమం, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు కేటాయింపులు పెరగనున్నాయి. ప్రస్తుత ఏడాది ఆదాయ, వ్యయాలను బేరీజు వేస్తూ వచ్చే ఏడాది రాబడులు, అవసరాలను పరిగణలోకి బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తున్నది. 2023-24లో కేంద్ర పన్నుల నుంచి రాష్ట్ర వాటాగా రూ.21వేల కోట్లకు వరకు రానున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి నిధులు విడుదలనున్నాయి. కేంద్రం రాష్ట్రానికి బడ్జెట్‌ను అదనపు నిధులు, గ్రాంట్లను కేంద్రం ప్రతిపాదించలేదు. రుణ పరిమితి పెంపునకు కూడా బడ్జెట్‌ అనుమతించలేదు. ఈ మేరకు సొంత ఆదాయ మార్గాలపైనే సర్కారు దృష్టి పెట్టి.. ఈ మేరకు బడ్జెట్‌ను కూర్పు చేసినట్లు తెలుస్తున్నది. మరో వైపు కేబినేట్‌ అనంతరం సీఎం కేసీఆర్‌ నాందేడ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. 1.30 గంటలకు సచ్‌ఖండ్‌బోడ్‌ మైదానంలో జరిగే సభలో పాల్గొనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.