కేంద్ర బడ్జెట్‌లోని ముఖ్యాంశాలివే..

విధాత‌: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై ఆమె ప్రసంగిస్తూ..అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్‌. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నాం. అమృతకాల విజన్‌ను మంత్రి వివరిస్తూ.. 2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నాం. ప్రపంచంలో అత్యధికంగా 7 శాతం వృద్ధి రేటు ఉన్న ఆర్థిక వ్యవస్థ మనది. సామాజిక భద్రత, డిజిటల్‌ పేమెంట్లలో చక్కటి వృద్ధి సాధించాం.సామాన్యుల సాధికారతకు ఈ బడ్జెట్‌ దోహదపడుతుందని […]

కేంద్ర బడ్జెట్‌లోని ముఖ్యాంశాలివే..

విధాత‌: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై ఆమె ప్రసంగిస్తూ..అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్‌. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నాం. అమృతకాల విజన్‌ను మంత్రి వివరిస్తూ.. 2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నాం. ప్రపంచంలో అత్యధికంగా 7 శాతం వృద్ధి రేటు ఉన్న ఆర్థిక వ్యవస్థ మనది. సామాజిక భద్రత, డిజిటల్‌ పేమెంట్లలో చక్కటి వృద్ధి సాధించాం.సామాన్యుల సాధికారతకు ఈ బడ్జెట్‌ దోహదపడుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు.

వేత‌న జీవుల‌కు ఊర‌ట‌.. ఆదాయ పరిమితి రూ.7 ల‌క్ష‌లకు పెంపు

యువత,మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు ఈ బడ్జెట్‌ ఆశాదీపం అన్నారు. ఈ బడ్జెట్‌ ఆర్థిక వృద్ధి రేటు 7శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. కొవిడ్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రగతి మందిగిస్తే భారత్‌ మాత్రం పురోగమించింది. పూర్వ బడ్జెట్‌లు నిర్మించిన పునాదులపై ఈ బడ్జెట్‌ సమర్పిస్తున్నామని తెలిపారు.

కరోనా సమయంలోపీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన పథకం కింద 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేశాం. ఈ ఏడాది కూడా అది కొనసాగింది. స్థిరీకరణతో కూడిన అభివృద్ధి దిశగా భారత్‌ అడుగులు వేస్తున్నది. దేశ తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది. భారత్‌ ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. వంద కోట్ల మందికి 220 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందించాం. మన దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దారిలోనే పయనిస్తున్నది.

కేంద్ర బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు ఇవే..

  • వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు
  • రూ. 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందిస్తాం.
  • 63 వేల వ్యవసాయ పరపతి సంఘాల డిజిటలైజేషన్‌.. రూ.2 వేల కోట్లు కేటాయింపు
  • శ్రీఅన్నపథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం
  • సహకారంతో సమృద్ధి విధానంలో రైతులకు ప్రోత్సాహం
  • పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ. 6 వేల కోట్లతో ప్రత్యేక పథకం
  • తృణ ధాన్యాలకు భారత్‌ను కేంద్రంగా చేస్తాం
  • వ్యవసాయ స్టార్టప్‌ల ప్రోత్సాహకానికి ప్రత్యేక నిధులు
  • ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యం పెంచుతాం
  • గ్రీన్‌ ఎనర్జీ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు
  • ఫార్మారంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం
  • ఏకలవ్య పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయుల నియామకం
  • 157 నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం
  • పీఎం ఆవాస్‌ యోజనకు రూ. 79 వేల కోట్లు
  • సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక తోడ్పాటు
  • నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ప్రోత్సహిస్తాం
  • రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు. ఇందుకోసం రూ. 13.7 కోట్ల కేటాయింపు
  • ఆత్మనిర్బర్‌ క్లీన్ ప్లాంట్‌ ప్రోగ్రామ్‌ ప్రకటిస్తున్నాం
  • రైల్వేకు రూ. 2.4 లక్షల కోట్లు
  • 2013-14తో పోలిస్తే రైల్వేకు 9 రెట్ల నిధులు
  • కీలకమైన వంద మౌలిక వసతులు ప్రాజెక్టులకు రూ. 75 వేల కోట్లు
  • బడ్జెట్‌లో మూలధన వ్యయం మొత్తం రూ. 10 లక్షల కోట్లు.

ధరలు తగ్గేవి: టీవీలు, కెమెరాలు, మొబైల్స్‌, లిథియం బ్యాటరీ

ధరలు పెరిగేవి: సిగరెట్లు, వెండి, బంగారం, వజ్రాలు, టైర్లు, రెడీమేడ్‌ వస్త్రాలు,

12 పైస‌లు పెరిగిన రూపాయి విలువ‌