పార్లమెంటు ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ కీలక భేటీ

తెలంగాణలో 14ఎంపీ సీట్లు గెలవాలన్న లక్ష్య సాధనకు కాంగ్రెస్ నాయకత్వం గట్టి కసరత్తునే సాగిస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు ఈ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ గెలిచే స్థానాలే కొలమానంగా మారనుండటంతో ఎలాగైన మెజార్టీ స్థానాలు గెలవడం ఆ పార్టీకి ప్రతిషాత్మకంగా మారింది.

పార్లమెంటు ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ కీలక భేటీ

హాజరుకానున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
పెండింగ్ మూడు స్థానాలపైన కీలక చర్చ

విధాత :తెలంగాణలో 14ఎంపీ సీట్లు గెలవాలన్న లక్ష్య సాధనకు కాంగ్రెస్ నాయకత్వం గట్టి కసరత్తునే సాగిస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు ఈ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ గెలిచే స్థానాలే కొలమానంగా మారనుండటంతో ఎలాగైన మెజార్టీ స్థానాలు గెలవడం ఆ పార్టీకి ప్రతిషాత్మకంగా మారింది. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం (14.04.2024) హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో కాంగ్రెస్‌ కీలక భేటీ జరుగనుంది.

ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యుటీ సీఎం భట్టి, సీఈసీ సభ్యులు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు హాజరవుతారు. ఇప్పటిదాకా ప్రకటించిన 14మంది అభ్యర్థులతో పాటు 17లోక్‌సభ స్థానాల నియోజకవర్గం ఇంచార్జిలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు.. బీఆరెస్‌, బీజేపీల బలాబలాలపై చర్చించి, కాంగ్రెస్‌ విజయ సాధన మార్గాలపై అభ్యర్థులకు, కేడర్‌కు మార్గనిర్ధేశం చేయనున్నారు. అలాగే ఇంకా అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టిన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగే అవకాశముంది. ఆ మూడు నియోజకవర్గాల నేతలతోనూ భేటీయై అభ్యర్థుల ఎంపికపై వారితో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.