Telangana | ఎట్టకేలకు.. మూడు బిల్లులకు గవర్నర్ ఆమోదం.. రెండు రాష్ట్రపతి వద్దకు
Telangana | తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్( Tamilisai Sounder Rajan ) ఎట్టకేలకు మూడు బిల్లులకు ఆమోదం తెలిపారు. రెండు బిల్లులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపారు. మరో రెండు బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. మరో రెండు బిల్లులను పెండింగ్‌లో పెట్టారు గవర్నర్ తమిళిసై. అయితే ఈ బిల్లులు గత ఏడాది సెప్టెంబర్‌లో అసెంబ్లీ, మండలిలో ఆమోదం పొందగా, వాటిని ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఏడెనిమిది నెలలు […]
Telangana | తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్( Tamilisai Sounder Rajan ) ఎట్టకేలకు మూడు బిల్లులకు ఆమోదం తెలిపారు. రెండు బిల్లులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపారు. మరో రెండు బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. మరో రెండు బిల్లులను పెండింగ్‌లో పెట్టారు గవర్నర్ తమిళిసై.
అయితే ఈ బిల్లులు గత ఏడాది సెప్టెంబర్‌లో అసెంబ్లీ, మండలిలో ఆమోదం పొందగా, వాటిని ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఏడెనిమిది నెలలు కావొస్తున్నప్పటికీ గవర్నర్ ఆమోదం తెలుపలేదు. గవర్నర్ బిల్లులు పెండింగ్‌లో పెట్టారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. మొత్తంగా ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ మూడు బిల్లులకు మాత్రమే ఆమోదం తెలిపారు.
గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు
1) తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు
2) ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ వర్సిటీగా అప్‌గ్రేడ్ చేసే బిల్లు
3) జీఎస్టీ చట్ట సవరణ
4) ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ
5) మున్సిపల్ చట్ట సవరణ
6) పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ
7) ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు
8) మోటర్ వెహికిల్ టాక్సేషన్ సవరణ బిల్లు
9) జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram