Telangana Group 1 results: తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదల
ఎట్టకేలకు గ్రూప్ 1 ఫలితాలు విడుదలవ్వడంతో.. అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. 563 గ్రూప్ 1 పోస్టులకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించింది.

Telangana Group 1 results : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా ఫలితాలను ప్రకటించింది. ఎన్నో అవాంతరాల తరువాత ఎట్టకేలకు గ్రూప్ 1 ఫలితాలు విడుదలవ్వడంతో.. అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. 563 గ్రూప్ 1 పోస్టులకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించింది. గతేడాది ఆక్టోబర్ లో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష్లలకు 21,093మంది అభ్యర్థుల హాజరయ్యారు. ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి ఆ ప్రక్రియ ముగిశాక 1:2 నిష్ఫత్తిలో తుది జాబితా వెల్లడించనుంది.
రేపు మంగళవారం గ్రూప్ 2 ఫలితాలు విడుదల కానున్నాయి. అలాగే ఈనెల 14న తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేస్తారు. ఈనెల 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలు విడుదల చేయనున్నారు. 19వ తేదీన ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తారు.
ఈనెల 20 లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు వెల్లడిస్తామని..అభ్యర్థుల మార్కులను వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చని టీజీపీఎస్సీ పేర్కొంది. మరోవైపు ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండానే పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటిస్తుండటం పట్ల దళితసంఘాలు భగ్గుమంటున్నాయి.