Minister Jagadish Reddy | 24 గంటల విద్యుత్తు సరఫరాలో తెలంగాణ రికార్డు: మంత్రి జగదీశ్‌ రెడ్డి

Minister Jagadish Reddy 50 వేల కోట్లతో ట్రాన్స్ మిషన్&డిస్ట్రిబ్యూషన్ కేసీఆర్ దార్శనికతతోటే విద్యుత్ రంగంలో విజయాలు 18,567 మెగావాట్లకు పెరిగిన విద్యుత్తు ఉత్పత్తి సామర్ధ్యం విధాత : 2014 తరువాత యావత్ భారత దేశంలోనే 24గంటల నిరంతర విద్యుత్తు సరఫరాలో తెలంగాణా రాష్ట్రం రికార్డ్ సృష్టించిందని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పేర్కోన్నారు. ఎఫ్. టి.సీ.సీ.ఐ ఆధ్వర్యంలో రెడ్ హిల్స్ ఫెడరేషన్ హౌజ్ లో పారిశ్రామిక వేత్తల ఇంటారాక్టివ్ సెషన్‌లో ప్రభుత్వ ప్రత్యేక ఇంధన శాఖా కార్యదర్శి సునీల్ […]

  • Publish Date - September 21, 2023 / 11:00 AM IST

Minister Jagadish Reddy

  • 50 వేల కోట్లతో ట్రాన్స్ మిషన్&డిస్ట్రిబ్యూషన్
  • కేసీఆర్ దార్శనికతతోటే విద్యుత్ రంగంలో విజయాలు
  • 18,567 మెగావాట్లకు పెరిగిన విద్యుత్తు ఉత్పత్తి సామర్ధ్యం

విధాత : 2014 తరువాత యావత్ భారత దేశంలోనే 24గంటల నిరంతర విద్యుత్తు సరఫరాలో తెలంగాణా రాష్ట్రం రికార్డ్ సృష్టించిందని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పేర్కోన్నారు. ఎఫ్. టి.సీ.సీ.ఐ ఆధ్వర్యంలో రెడ్ హిల్స్ ఫెడరేషన్ హౌజ్ లో పారిశ్రామిక వేత్తల ఇంటారాక్టివ్ సెషన్‌లో ప్రభుత్వ ప్రత్యేక ఇంధన శాఖా కార్యదర్శి సునీల్ శర్మతో కలిసి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

తెలంగాణా రాష్ట్రం-ఇంధన రంగంలో భవిష్యత్ సవాళ్లు అన్న అంశంపై మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ 50 వేల కోట్లతో ట్రాన్స్ మిషన్ , డిస్ట్రిబ్యూషన్ లు అభివృద్ధి పరచడం వల్లనే ఈ రోజు పారిశ్రామిక వేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారన్నారు. అందుకు సీఎం కేసీఆర్ దార్శనికత విద్యుత్తు సంస్థల యాజామాన్యాలు, సిబ్బంది కృషి ఉందన్నారు.

2014 కు ముందు పారిశ్రామిక వేత్తలు ఎంత ధర అయినా చెల్లించి విద్యుత్తు ను కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు అందుకు భిన్నంగా ఉందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ మహిమనేనని ఆయన కొనియాడారు. అయితే అదే సమయంలో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ పై ఒత్తిడి తేవొద్దని ఆయన పారిశ్రామిక వేత్తలకు సూచించారు. గ్రిడ్ తో నిమిత్తం లేకుండా అందులో రాత్రివేళల్లో విద్యుత్తు సరఫరా అసంభవమని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వానికున్న సామాజిక బాధ్యతలు దృష్ట్యా ఇది ఆచరణాత్మకంగా సాధ్యం కాదని ఆయన తెలిపారు. ఈ సెషన్ లో పాల్గొన్న సుమారు 150 మంది పారిశ్రామిక వేత్తలు గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సిస్ పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని కోరగా మంత్రి జగదీశ్‌ రెడ్డి సున్నితంగా తిరస్కరిస్తూ ఈ విషయంలో ఒత్తిడి వద్దని, సరిపడా విద్యుత్తు సరఫరా కు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు.