Telangana | ద‌స‌రా సెల‌వులు కుదింపు.. అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్ విడుద‌ల‌

Telangana | తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌కు సంబంధించి స్కూల్ ఎడ్యుకేష‌న్ అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్‌(2023-24) ను విడుద‌ల చేసింది. ఈ విద్యా సంవ‌త్స‌రం మొత్తం 229 రోజుల పాటు పాఠ‌శాల‌లు ప‌ని చేయ‌నున్నాయి. ప‌దో త‌ర‌గ‌తి సిల‌బ‌స్‌ను 2024, జ‌న‌వ‌రి 10వ తేదీ నాటికి పూర్తి చేయాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఇక పాఠ‌శాల ప‌ని దినాల్లో ప్ర‌తి రోజు అర గంట పాటు పిల్ల‌ల చేత పుస్త‌క ప‌ఠ‌నం చేయించాల‌ని ఆదేశించారు. స్కూల్ అసెంబ్లీ ముందు లేదా […]

Telangana | ద‌స‌రా సెల‌వులు కుదింపు.. అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్ విడుద‌ల‌

Telangana | తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌కు సంబంధించి స్కూల్ ఎడ్యుకేష‌న్ అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్‌(2023-24) ను విడుద‌ల చేసింది. ఈ విద్యా సంవ‌త్స‌రం మొత్తం 229 రోజుల పాటు పాఠ‌శాల‌లు ప‌ని చేయ‌నున్నాయి. ప‌దో త‌ర‌గ‌తి సిల‌బ‌స్‌ను 2024, జ‌న‌వ‌రి 10వ తేదీ నాటికి పూర్తి చేయాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

ఇక పాఠ‌శాల ప‌ని దినాల్లో ప్ర‌తి రోజు అర గంట పాటు పిల్ల‌ల చేత పుస్త‌క ప‌ఠ‌నం చేయించాల‌ని ఆదేశించారు. స్కూల్ అసెంబ్లీ ముందు లేదా త‌ర్వాత.. త‌ర‌గ‌తి గ‌దిలో ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. వారానికి 3 నుంచి 5 పీరియ‌డ్లు ఆట‌ల‌కు కేటాయించాలి.

ప్ర‌తి నెల‌లో నాలుగో శనివారాన్ని నో బ్యాగ్ డేగా పాటించాల‌ని ఆదేశించింది. ఈ విద్యాసంవ‌త్స‌రంలో మొత్తం 10 రోజుల పాటు పిల్ల‌లు సంచులు లేకుండా పాఠ‌శాల‌కు వెళ్ల‌నున్నారు. ఆ రోజుల్లో ఎటువంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌న్న దానిపై త్వ‌ర‌లోనే మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేస్తామ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

ద‌స‌రా సెల‌వులు కుదింపు

ద‌స‌రా సెల‌వులు గ‌తేడాది 14 రోజులు ఉండ‌గా, ఈ ఏడాది 13 రోజులే ఇచ్చారు. అంటే ఒక రోజు త‌గ్గించారు. ఇక క్రిస్మ‌స్ సెల‌వులు కూడా ఏడు నుంచి ఐదు రోజుల‌కు త‌గ్గించారు. ద‌స‌రా సెల‌వుల‌ను అక్టోబ‌ర్ 13 నుంచి 25 వ‌ర‌కు, క్రిస్మ‌స్ సెల‌వుల‌ను డిసెంబ‌ర్ 22 నుంచి 26 వ‌ర‌కు, సంక్రాంతి సెల‌వులను 2024, జ‌న‌వ‌రి 13 నుంచి 17 వ‌ర‌కు ప్ర‌క‌టించారు. వేస‌వి సెల‌వుల‌ను ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వ‌ర‌కు ప్ర‌క‌టించారు.