Sharath Babu | సీనియర్‌ నటుడు శరత్‌ బాబుకు అస్వస్థత..!

Sharath Babu | సీనియర్‌ టాలీవుడ్‌ నటుడు శరత్‌ బాబు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి ఫేస్‌బుక్‌ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. ‘నాకు ఇష్టమైన హీరో.. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్‌ బాబు త్వరలో కోలుకోవాలని మనం స్వామిని వేడుకుందాం. శ్రీరామ రక్ష’ అంటూ పోస్ట్‌ పెట్టింది. ఈ పోస్టు చూసిన వారంతా ఆయనకు ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. […]

  • By: Vineela |    latest |    Published on : Mar 29, 2023 4:42 PM IST
Sharath Babu | సీనియర్‌ నటుడు శరత్‌ బాబుకు అస్వస్థత..!

Sharath Babu | సీనియర్‌ టాలీవుడ్‌ నటుడు శరత్‌ బాబు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి ఫేస్‌బుక్‌ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.

‘నాకు ఇష్టమైన హీరో.. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్‌ బాబు త్వరలో కోలుకోవాలని మనం స్వామిని వేడుకుందాం. శ్రీరామ రక్ష’ అంటూ పోస్ట్‌ పెట్టింది. ఈ పోస్టు చూసిన వారంతా ఆయనకు ఏమైందంటూ ఆరా తీస్తున్నారు.

శరత్‌ బాబు హీరోగా 1973లో ‘రామరాజ్యం’ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కన్నె వయసు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి తదితర చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటించి, మంచి గుర్తింపు పొందారు.

దాదాపు 220కిపైగా చిత్రాల్లో నటించారు. మూడుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం స్టార్‌ హీరోలకు తండ్రిగా తదితర పాత్రల్లో నటిస్తున్నారు. శరత్‌ బాబు అలనాటి హాస్య నటి రమాప్రభ భర్త. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు విభేదాల కారణంగా దూరమయ్యారు.