Modi | తెలుగు భాష.. ప్రత్యేకమైనది, పురాతనమైనది: మన్‌కీ బాత్‌లో మోడీ

Modi | విధాత : తెలుగు భాష చాల ప్రత్యేకమైనదని, సంస్కృతం లాగానే అతి పురాతనమైందని ప్రధానీ నరేంద్ర మోడీ అన్నారు. సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం మన్‌కీ బాత్‌లో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత పురాతన భాష సంస్కృతం అన్నారు. సంస్కృత భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృత భాషను నేర్చుకునేందుకు నేడు అనేక మంది ఆసక్తి చూపుతున్నారన్నారు. సంస్కృతం, యోగా, ఆయుర్వేదం, ఫిలాసఫీ వంటి అంశాల అధ్యాయనానికి ఆసక్తి చూపడం స్వాగతించ దగ్గ […]

  • By: krs    latest    Aug 27, 2023 4:32 PM IST
Modi | తెలుగు భాష.. ప్రత్యేకమైనది, పురాతనమైనది: మన్‌కీ బాత్‌లో మోడీ

Modi |

విధాత : తెలుగు భాష చాల ప్రత్యేకమైనదని, సంస్కృతం లాగానే అతి పురాతనమైందని ప్రధానీ నరేంద్ర మోడీ అన్నారు. సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం మన్‌కీ బాత్‌లో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత పురాతన భాష సంస్కృతం అన్నారు. సంస్కృత భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృత భాషను నేర్చుకునేందుకు నేడు అనేక మంది ఆసక్తి చూపుతున్నారన్నారు.

సంస్కృతం, యోగా, ఆయుర్వేదం, ఫిలాసఫీ వంటి అంశాల అధ్యాయనానికి ఆసక్తి చూపడం స్వాగతించ దగ్గ పరిణామామన్నారు. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకోబోతున్నామని తెలుగు ప్రజలకు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మన్‌కీబాత్ 104వ ఏపిసోడ్‌లో మోడీ మాట్లాడుతూ చంద్రయాన్ 3 భారత విజయానికి ప్రతీకగా, మహిళా సాధికారిత చిహ్నంగా నిలుస్తుందన్నారు. తొలిసారి భారత్ జీ-20దేశాల సదస్సుకు అధ్యక్షత వహిస్తుందంటే ప్రజలే అధ్యక్షత వహించినట్లుగా భావించాలన్నారు. క్రీడారంగంలో భారత్ విజయాలను కొనియాడుతూ దేశ వ్యాప్తంగా ప్రస్తుతం మేరీ మాటీ..మేరీ దేశ్ కార్యక్రమం సాగుతుందన్నారు. సెప్టెంబర్ నెలలో ప్రతి ఇల్లు, గ్రామం నుంచి మట్టి నమూనా సేకరణ ఉద్యమంగా సాగనుందన్నారు.