కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో మరొకరు..?
విధాత: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసు జాబితాలో మరొకరు చేరారు. అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన అశోక్ గెహ్లాట్.. చివరకు తప్పుకున్న విషయం విదితమే. అశోక్ గెహ్లాట్ తప్పుకోవడంతో.. దిగ్విజయ్ సింగ్ తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. జీ-23 గ్రూపులో భాగస్వామిగా ఉన్న శశిథరూర్.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఆ తర్వాత వెనక్కి తగ్గలేదు. అధ్యక్ష పదవికి ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు […]
విధాత: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసు జాబితాలో మరొకరు చేరారు. అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన అశోక్ గెహ్లాట్.. చివరకు తప్పుకున్న విషయం విదితమే. అశోక్ గెహ్లాట్ తప్పుకోవడంతో.. దిగ్విజయ్ సింగ్ తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
జీ-23 గ్రూపులో భాగస్వామిగా ఉన్న శశిథరూర్.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఆ తర్వాత వెనక్కి తగ్గలేదు. అధ్యక్ష పదవికి ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసు జాబితాలో మరో నాయకుడు చేరారు. ఆయన ఎవరంటే ఎంపీ మనీష్ తివారీ. ఈయన కూడా జీ-23 గ్రూపులో సభ్యులు. జీ-23లో సభ్యులుగా ఉన్న ఫృథ్వీరాజ్ చవాన్, భూపీందర్ హుడా, మనీష్ తివారీ కలిసి ఆనంద్ శర్మ ఇంట్లో నిన్న సమావేశమై.. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులతో పాటు అధ్యక్ష పదవి ఎన్నికలపై చర్చించారు.
ఇక మనీశ్ తివారీ కూడా పోటీ చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆనంద్ శర్మ నివాసంలో మీటింగ్ అనంతరం మనీష్ తివారీ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగడం మంచి పరిణామం అని మనీష్ తివారీ పేర్కొన్నారు.
ఇందుకు గానూ సోనియాగాంధీకి తివారీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్లు ఎవరెవరో దాఖలు చేస్తారో చూద్దాం.. అందులో ఎవరు ఉత్తమం అనిపిస్తే వారికే ఓటు వేసి ఎన్నుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram