Thailand | రెండు వారాల్లో ఎన్నికలు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రధాని అభ్యర్థి
Thailand | ఎన్నికలంటేనే హడావుడి ఉంటుంది. ప్రచారంలో మునిగి తేలుతారు. పోలింగ్ తేదీ సమీపిస్తుందంటే చాలు.. గెలించేందుకు ఉన్న అవకాశాలు, మార్గాలపై దృష్టి సారిస్తారు. గట్టి పోటీనిచ్చే అభ్యర్థులైతే తమ ఓటర్లను గుప్పిట్లో ఉంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఓ ప్రధాని అభ్యర్థి మాత్రం ఎన్నికలకు రెండు వారాలకు ముందు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. మరి ఆ ప్రధాని అభ్యర్థి ఎవరో తెలుసుకోవాలంటే థాయ్‌లాండ్ వెళ్లాల్సిందే. థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్షిన్ షినవత్రా చిన్న కుమార్తె […]

Thailand |
ఎన్నికలంటేనే హడావుడి ఉంటుంది. ప్రచారంలో మునిగి తేలుతారు. పోలింగ్ తేదీ సమీపిస్తుందంటే చాలు.. గెలించేందుకు ఉన్న అవకాశాలు, మార్గాలపై దృష్టి సారిస్తారు. గట్టి పోటీనిచ్చే అభ్యర్థులైతే తమ ఓటర్లను గుప్పిట్లో ఉంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఓ ప్రధాని అభ్యర్థి మాత్రం ఎన్నికలకు రెండు వారాలకు ముందు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. మరి ఆ ప్రధాని అభ్యర్థి ఎవరో తెలుసుకోవాలంటే థాయ్‌లాండ్ వెళ్లాల్సిందే.
థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్షిన్ షినవత్రా చిన్న కుమార్తె పేటోంగ్టార్న్ షినవత్రా ప్రధాని అభ్యర్థిగా బరిలో దిగారు. 15 ఏండ్ల క్రితం తన తండ్రి స్థాపించిన ఫ్యూ థాయ్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు షినవత్రా. 36 ఏండ్ల వయసున్న షినవత్రానే పార్టీకి హెడ్.
అయితే ఈ ఎన్నికల్లో షినవత్రా ముందు వరుసలో ఉన్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఎన్నికలకు రెండు వారాల సమయమే ఉంది. అంతలోనే ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని థాయ్ ప్రజలకు షినవత్రా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
నిండు గర్భిణిగా ఉన్న సమయంలో షినవత్రా వీడియో కాల్స్ ద్వారా తన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె తన మద్దతుదారులతో మాట్లాడుతూనే ఉన్నారు. షినవత్రా కుటుంబానికి ఉత్తర, ఈశాన్య థాయ్‌లాండ్ గ్రామీణ ఓటర్ల మద్దతు ఉంది.
అయితే భారీ మద్దతు ఉన్న షినవత్రా ఎన్నికల్లో గెలిచినప్పటికీ.. మిలిటరీ నియమించిన 250 సెనెటర్ల మద్దతు పొందుతారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రధాని ఎన్నికల్లో ఈ నియమిత సెనెటర్లది కీలకపాత్ర.
View this post on Instagram