Cybertruck | మొదటి బ్యాచ్ సైబర్ ట్రక్‌లలో భారీ లోపాలు.. డిజైన్ మార్చాల్సిందేనా?
Cybertruck విధాత: రవాణా రంగంలో విప్లవాత్మక ప్రాజెక్టు అని చెబుతున్న టెస్లా (Tesla) సైబర్‌ట్రక్ మరోసారి వార్తల్లో నిలిచింది. నాలుగేళ్ల క్రితమే దీని నమూనా మోడల్‌ను ప్రపంచానికి పరిచయం ఎలాన్ మస్క్ 2021 నుంచి ఉత్పత్తి మొదలుపెడతామని ప్రకటించారు. అయితే పలు మార్లు వాయిదాలు పడీ పడీ 2023 వచ్చినా ఈ వాహనం ఇంకా రోడ్లపై తన పరుగు ప్రారంభించలేదు. తాజాగా వీటి మాస్ ప్రొడక్షన్‌ను ప్రారంభించగా డిజైన్ లోపాలతో వాహనం రూపు మారిపోతోందని టెస్లా గుర్తించినట్లు […]

Cybertruck
విధాత: రవాణా రంగంలో విప్లవాత్మక ప్రాజెక్టు అని చెబుతున్న టెస్లా (Tesla) సైబర్‌ట్రక్ మరోసారి వార్తల్లో నిలిచింది. నాలుగేళ్ల క్రితమే దీని నమూనా మోడల్‌ను ప్రపంచానికి పరిచయం ఎలాన్ మస్క్ 2021 నుంచి ఉత్పత్తి మొదలుపెడతామని ప్రకటించారు. అయితే పలు మార్లు వాయిదాలు పడీ పడీ 2023 వచ్చినా ఈ వాహనం ఇంకా రోడ్లపై తన పరుగు ప్రారంభించలేదు.
తాజాగా వీటి మాస్ ప్రొడక్షన్‌ను ప్రారంభించగా డిజైన్ లోపాలతో వాహనం రూపు మారిపోతోందని టెస్లా గుర్తించినట్లు తెలుస్తోంది. అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న సైబర్ ట్రక్ (Cyber Truck) ఫ్లాట్ ప్యానల్స్, దాని ముక్కోణపు డిజైనే ఈ సమస్యలకు కారణాలని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆస్టిన్‌లోని గిగా ఫ్యాక్టరీలో వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. ఇటీవలే తొలి బ్యాచ్ వాహనాలను పరిశీలించగా అనేక నాణ్యతా పరమైన, డిజైన్ పరమైన, రంగు విషయంలో కూడా తీవ్రలోపాలు కనిపించాయని సమాచారం. దీంతో అప్రమత్తమైన ఎలాన్ మస్క్ టెస్లా ఉద్యోగులందరికీ మెయిల్ చేశారు. సైబర్ ట్రక్ ప్రొడక్షన్‌లో కఠినమైన ఎస్ఓపీని పాటించాలని ఎటువంటి నిర్లిప్తతకు తావు ఇవ్వొద్దని వారికి సూచించారు.
ఈ వార్తలపై ప్రముఖ కార్ల డిజైనర్ అడ్రైన్ క్లార్క్ స్పందించారు. టెస్లా సైబర్ ట్రక్ డిజైన్‌లోనే లోపముందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత డిజైన్‌లో అతి స్వల్ప లోపం కూడా భూతద్దంలో చూసినట్లు కనిపిస్తుందని తెలిపారు. మాస్ ప్రొడక్షన్ చేసే ఉద్దేశం ఉంటే సైబర్ ట్రక్ డిజైన్‌ను మార్చడమే సరైన ఉపాయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫ్లాట్ ప్యానల్స్‌పై సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తానే కాకుండా పరిశ్రమలో ఉన్న కార్ డిజైనర్లందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నామని క్లార్క్ స్పష్టం చేశారు.
సైబర్ ట్రక్‌లో మామూలు కార్లలాగే కొన్ని ఒంపులు ఉండాలని సూచించారు. అత్యంత పటిష్ఠమైన ప్రణాళిక ద్వారా డిజైన్‌లోపాలను అధిగమించొచ్చని మస్క్ భావిస్తున్నారని.. కానీ పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేయాల్సి వచ్చినపుడు ఆ విధానం నిష్ప్రయోజనమని గుర్తుచేశారు. సింపుల్ డిజైన్‌కు.. చీప్ డిజైన్‌కు మధ్య చాలా తేడా ఉంటుందని.. సైబర్‌ట్రక్ ఆలోచన సింపుల్ డిజైన్‌తో మొదలై తయారీ చీప్ డిజైన్‌తో ముగుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.