Sangareddy | BRSలో నరొత్తం చేరిక.. అలర్టైన TPCC

Sangareddy సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో రేవంత్ సమావేశం విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత నరోత్తం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో పిసిసి అలెర్ట్ అయ్యింది. శనివారం టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సంగారెడ్డి ఎమ్మెల్యే సతీమణి నిర్మలా జగ్గారెడ్డి అధ్వర్యంలో జహీరాబాద్ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ […]

  • Publish Date - July 8, 2023 / 09:10 AM IST

Sangareddy

  • సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో రేవంత్ సమావేశం

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత నరోత్తం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో పిసిసి అలెర్ట్ అయ్యింది. శనివారం టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సంగారెడ్డి ఎమ్మెల్యే సతీమణి నిర్మలా జగ్గారెడ్డి అధ్వర్యంలో జహీరాబాద్ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని చూచినట్లు సమాచారం. ఈసమావేశంలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి నర్సింహ రెడ్డి, రాష్ట్ర డీసీసీ, పిసిసి ఎస్టీ, ఎస్టీ నేతలు, తదితరులు నేతలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, గీతా రెడ్డి తో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం.