Marriage | తండ్రి భౌతిక‌కాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు..

Marriage | ఆ యువ‌కుడికి నాన్నంటే ఎంతో ప్రేమ‌. నాన్న( Father ) శాశ్వ‌తంగా ఈ లోకాన్ని విడిచిపోవ‌డం అత‌నికి తీర‌ని వేద‌న మిగిల్చింది. త‌న‌ పెళ్లికి వారం రోజుల ముందే నాన్న చ‌నిపోవ‌డం మ‌రింత దిగ్భ్రాంతికి గురి చేసింది. త‌న వివాహాన్ని చూడాల‌న్న తండ్రి కోరిక‌ను ఎలాగైనా తీర్చాల‌ని కుమారుడు నిర్ణ‌యించుకున్నాడు. త‌న‌కు కాబోయే యువ‌తిని ఒప్పించి.. తండ్రి భౌతిక‌కాయం( Dead Body ) ముందు పెళ్లి చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు( Tamil Nadu […]

Marriage | తండ్రి భౌతిక‌కాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు..

Marriage | ఆ యువ‌కుడికి నాన్నంటే ఎంతో ప్రేమ‌. నాన్న( Father ) శాశ్వ‌తంగా ఈ లోకాన్ని విడిచిపోవ‌డం అత‌నికి తీర‌ని వేద‌న మిగిల్చింది. త‌న‌ పెళ్లికి వారం రోజుల ముందే నాన్న చ‌నిపోవ‌డం మ‌రింత దిగ్భ్రాంతికి గురి చేసింది.

త‌న వివాహాన్ని చూడాల‌న్న తండ్రి కోరిక‌ను ఎలాగైనా తీర్చాల‌ని కుమారుడు నిర్ణ‌యించుకున్నాడు. త‌న‌కు కాబోయే యువ‌తిని ఒప్పించి.. తండ్రి భౌతిక‌కాయం( Dead Body ) ముందు పెళ్లి చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు( Tamil Nadu )లోని క‌ళ్ల‌క్కురిచ్చిలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ళ్ల‌క్కురిచ్చి స‌మీపంలోని పెరువంగూరు గ్రామానికి చెందిన పంచాయ‌తీ యూనియ‌న్ అధ్య‌క్షురాలు అయ్య‌మ్మాళ్ భ‌ర్త రాజేంద్ర‌న్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ సోమ‌వారం చ‌నిపోయారు. రాజేంద్ర‌న్ కుమారుడు ప్ర‌వీణ్‌ వివాహం ఈ నెల 27న జ‌ర‌గాల్సి ఉంది. అంత‌లోనే ఆయ‌న చ‌నిపోవ‌డంతో.. కుమారుడు క‌న్నీరుమున్నీరు అయ్యాడు.

త‌న తండ్రి క‌ళ్లెదుట పెళ్లి చేసుకోవాల‌నుకున్న కోరిక కుమారుడికి మిగిలిపోయింది. అయితే రాజేంద్ర‌న్ అంత్య‌క్రియ‌ల‌కు చెన్నైకి చెందిన వ‌ధువు స్వ‌ర్ణ‌మాల్య త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వ‌చ్చింది. తండ్రి భౌతిక‌కాయం ముందు పెళ్లి చేసుకుందాని స్వ‌ర్ణ‌మాల్య‌కు ప్ర‌వీణ్ చెప్ప‌డంతో.. ఆమె అంగీక‌రించింది. దీంతో ఇద్ద‌రూ పెళ్లి దుస్తులు ధ‌రించి.. రాజేంద్ర‌న్ పార్థివ‌దేహం ముందు పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌య్యారు.