Rushikonda | అవి టూరిజం భవనాలు.. రుషికొండ లొల్లికి రోజా వివరణ

Rushikonda | విశాఖలో రుషికొండను ధ్వంసం చేస్తూ జగన్ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. పర్యావరణానికి ఇది విఘాతం అంటూ పవన్ చేసిన ప్రసంగం టివిలో, ఫోన్లలో హడావుడి చేసింది. అయితే దీని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వాస్తవానికి నిన్న పవన్ చేసిన ఆరోపణలకు వైఎస్సార్ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్లో సమాధానం ఇస్తూ అక్కడ కడుతున్నవి ప్రభుత్వ సచివాలయం భవనాలని పేర్కొంది. అయితే ఆ తరువాత అది నిజం కాదని చెబుతూ పార్టీ ఆ పోస్ట్ […]

  • By: krs    latest    Aug 13, 2023 1:40 PM IST
Rushikonda | అవి టూరిజం భవనాలు.. రుషికొండ లొల్లికి రోజా వివరణ

Rushikonda |

విశాఖలో రుషికొండను ధ్వంసం చేస్తూ జగన్ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. పర్యావరణానికి ఇది విఘాతం అంటూ పవన్ చేసిన ప్రసంగం టివిలో, ఫోన్లలో హడావుడి చేసింది. అయితే దీని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వాస్తవానికి నిన్న పవన్ చేసిన ఆరోపణలకు వైఎస్సార్ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్లో సమాధానం ఇస్తూ అక్కడ కడుతున్నవి ప్రభుత్వ సచివాలయం భవనాలని పేర్కొంది.

అయితే ఆ తరువాత అది నిజం కాదని చెబుతూ పార్టీ ఆ పోస్ట్ తీసేసింది. అయితే అప్పటికే ఆ విషయాన్నీ పట్టుకుంటి టిడిపి సోషల్ మీడియా గోల చేసేసింది. దీంతో రోజా వచ్చి వివరణ ఇచ్చారు. శాఖకు 69 ఎకరాలు భూమి ఉందని, అందులో కేవలం 2.7 ఎకరాల్లో భవనాలు నిర్మిస్తున్నామని వివరించారు.

అక్కడ అప్పటికే గతంలో ఎప్పుడో నిర్మించిన హరిత రిసార్ట్స్, ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఇప్పుడు కొత్తవి నిర్మిస్తున్నామని రోజా వివరించారు. జగన్ ఎక్కడ ఉండాలన్నది ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు.

‘‘పవన్ వార్డు మెంబర్ కూడా కాదు.. అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఈనాడులో రాస్తారు, కానీ,టూరిజం మంత్రి చెబితే రాయరు, ఈనాడు జర్నలిజం విలువలు దిగజారిపోయాయి.. చంద్రబాబు, రఘురామ తదితరులు రుషికొండపై కోర్టులో కేసు వేశారు.. కానీ, నిర్మాణాలు ఆపాలని కోర్టు స్టే ఇవ్వలేదు. హైకోర్టు అనుమతితో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు కోర్టుకు ప్రోగ్రెస్ పై అపిడవిట్ సమర్పిస్తున్నాం.

ఒకవేళ కోర్టు మార్పులు చేర్పులు సూచిస్తే.. చేస్తాం..ఎన్జీటీ కూడా అనుమతిచ్చింది’’ అన్నారు. విశాఖ బ్రాండ్ ను వారు దెబ్బతీస్తున్నారని, అబద్దాలు చెబితే చంద్రబాబు, పవన్ లను విశాఖ ప్రజలు తన్ని తరిమి కొడతారని అన్నారు.

టీడీపీకి కావాల్సిన వాళ్లకు నిర్మాణాలు ఇచ్చినపుడు పర్యావరణం దెబ్బతినలేదా? అని పవన్ ను ప్రశ్నించారు రోజా. అఅంతేకాకుండా విశాఖలో కొండమీద రామానాయుడు స్టూడియో ఉంది. హైదరాబాద్ లో చిరంజీవి ఇల్లు కూడా కొండమీదే ఉంది. ఇవన్నీ పర్యావరణానికి విఘాతం కాదా అని రోజా ప్రశ్నించారు.