అలీగఢ్ ముస్లిం వర్సిటీలో కాల్పులు

- ముగ్గురికి గాయాలు.. రంగంలోని పోలీసులు
విధాత: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లి యూనివర్సిటీ క్యాంపస్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే, వారికి ఎలాంటి ప్రాణాప్రాయం లేదని వైద్యులు ధ్రువీకరించారు. యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు రంగంప్రవేశం చేసిన పోలీసులు కాల్పుల ఘటనపై విచారణ జరుపుతున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. మంగవారం తెల్లవారుజామున వర్సిటీ క్యాంపస్‌లోని నార్త్ హాల్ వద్ద రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఏదో అంశంపై వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలో ఒక వర్గానికి యువకుడు మరోవర్గం వారిపై కాల్పులు జరుపగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కళాశాలకు తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రాణపాయం లేదని వైద్యులు వెల్లడించారు.
వర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పలువురి విద్యార్థులను విచారించారు. కాల్పుల ఘటన వెనుక పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నదని పోలీసులు వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వర్సిటీలో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు.