Tiger | నడి రోడ్డుపై టైగ‌ర్‌కు దాహం.. ఏం చేసిందో తెలుసా..?

Tiger ముందే ఎండాకాలం. ఎండ‌లు మండిపోతున్నాయి. స‌రైన నీటి వ‌న‌రులు లేక మూగ‌జీవాలు అల్లాడి పోతున్నాయి. ఓ బెంగాల్ టైగ‌ర్ కూడా దాహంతో విల‌విలలాడిపోయింది. నీటి కోసం అడ‌వి అంతా తిరిగి.. చివ‌ర‌కు రోడ్డుపై ఉన్న గుంత‌లో నీరు ఉండ‌టాన్ని గ్ర‌హించింది ఆ టైగ‌ర్. ఇంకేముంది ఆ గుంత వ‌ద్ద‌నే పులి కాసేపు నిల్చుని.. నీళ్లు తాగి దాహం తీర్చుకుంది. ఈ క్ర‌మంలో పులిని చూసిన వాహ‌న‌దారులు త‌మ వాహ‌నాల‌ను ఎక్క‌డిక‌క్క‌డ నిలిపివేశారు. టైగ‌ర్ త‌న దాహం […]

  • Publish Date - May 3, 2023 / 06:04 AM IST

Tiger

ముందే ఎండాకాలం. ఎండ‌లు మండిపోతున్నాయి. స‌రైన నీటి వ‌న‌రులు లేక మూగ‌జీవాలు అల్లాడి పోతున్నాయి. ఓ బెంగాల్ టైగ‌ర్ కూడా దాహంతో విల‌విలలాడిపోయింది. నీటి కోసం అడ‌వి అంతా తిరిగి.. చివ‌ర‌కు రోడ్డుపై ఉన్న గుంత‌లో నీరు ఉండ‌టాన్ని గ్ర‌హించింది ఆ టైగ‌ర్.

ఇంకేముంది ఆ గుంత వ‌ద్ద‌నే పులి కాసేపు నిల్చుని.. నీళ్లు తాగి దాహం తీర్చుకుంది. ఈ క్ర‌మంలో పులిని చూసిన వాహ‌న‌దారులు త‌మ వాహ‌నాల‌ను ఎక్క‌డిక‌క్క‌డ నిలిపివేశారు. టైగ‌ర్ త‌న దాహం తీర్చుకుని అడ‌విలోకి వెళ్లిన త‌ర్వాత వాహ‌నాలు నెమ్మ‌దిగా క‌దిలాయి.

ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని క‌త‌ర్నియాఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చుయ‌రీలో వెలుగు చూసింది. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ ప్ర‌వీణ్ క‌శ్వాన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Latest News