ప్ర‌జ‌ల‌కు పులి నేర్పిన ప్ర‌కృతి పాఠాలు!

సముద్రపు లోతు నుంచి పర్వత శిఖరాల వరకు మానవులు భూగ్ర‌హాన్నిప్లాస్టిక్‌తో నింపేశారు. ప్లాస్టిక్ వ‌స్తువులు అత్యంత మారుమూల ప్రాంతాల‌ను, సహజమైన అడవుల‌ను, చెరువును కూడా కప్పేశాయి

ప్ర‌జ‌ల‌కు పులి నేర్పిన ప్ర‌కృతి పాఠాలు!
  • ఇందు క‌ల‌దు.. అందు లేద‌ని సందేహం వ‌ల‌దు..
  • ఎందెందు వెదికినా అందందు క‌ల‌దు ప్లాస్టిక్‌..
  • అన్న‌ట్టుగా భూమండ‌లం మొత్తం ప్లాస్టిక్‌తో నిండిపోయింది.


సముద్రపు లోతు నుంచి పర్వత శిఖరాల వరకు మానవులు భూగ్ర‌హాన్నిప్లాస్టిక్‌తో నింపేశారు. ప్లాస్టిక్ వ‌స్తువులు అత్యంత మారుమూల ప్రాంతాల‌ను, సహజమైన అడవుల‌ను, చెరువును కూడా కప్పేశాయి. ఫలితంగా అడవి జంతువులు ప్లాస్టిక్‌ను నమలడం వ‌ల్ల అనారోగ్యం పాల‌వుతున్నాయి. కొన్నిసార్లు చ‌నిపోతున్నాయి కూడా. అయినా, మాన‌వులు ప్లాస్టిక్ వినియోగం మాన‌డం లేదు. వాడిన వాటిని స‌క్ర‌మంగా పార‌వేయ‌డం లేదు. దాంతో జీవ‌వైవిధ్యానికి ఆ ప్లాస్టిక్ పెను ముప్పుగా ప‌రిణ‌మించింది.


వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ దీప్ కతికర్ తీసిన ఓ వీడియో ప్లాస్టిక్ ముప్పు ఏ స్థాయిలో ఉందో చూపిస్తున్న‌ది. మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌లోని నీటికుంట నుంచి ఓ పులి ప్లాస్టిక్ బాటిల్‌ను తీయడం వీడియోలో ఉన్న‌ది. ప్లాస్టిక్ భూతం మ‌న‌ జీవితాల‌ను ఎంత‌గా ప్ర‌భావం చేస్తున్న‌దో ఈ పులి పాఠాలు చెప్తున్న‌ట్టు వీడియోలో క‌నిపిస్తున్న‌ది. ఈ ఫుటేజీని డిసెంబర్ 2023లో చిత్రీకరించారు. గంభీరమైన పులి నీటి నుంచి ప్లాస్టిక్ బాటిల్‌ను నోటితో తీసి, ఆపై బాటిల్‌ను పట్టుకుని వెళ్లిపోతున్నట్టు వీడియోలో క‌నిపిస్తున్న‌ది.


పులి చేసిన ప‌ని మన అడవులను మ‌నం పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నిద్దాం.. అన్న‌ట్టుగా లేదూ!