- బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో ఘటన
- పులిని బంధించిన అటవీ అధికారులు
విధాత: కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లోని హెడియాల రేంజ్‌లో పులిదాడిలో మహిళ మరణించారు. మహిళ మరణానికి కారణమైన 10 ఏండ్ల మగ పులిని మంగళవారం అటవీ అధికారులు బంధించారు. పులి ఆరోగ్యం బాగానే ఉన్నదని, దానిని కూర్గల్లి పునరావాస కేంద్రానికి తరలించినట్టు కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు.
బండిపూర్ టైగర్ రిజర్వ్‌లోని బల్లూరు హుండీ ప్రాంతంలో పశువులను మేపుతున్న 50 ఏండ్ల మహిళ రత్నమ్మపై శుక్రవారం పులి దాడి చేసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పులి రత్నమ్మపై వెనుక నుంచి దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోగా మిగిలిన ఇద్దరు మహిళలు పారిపోయారు. ఇదే పులి గతంలో 70 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసింది.
పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. అటవీ సిబ్బంది వ్యూహాత్మక పాయింట్లను పర్యవేక్షిస్తూ టైగర్ కదలికను ట్రాక్ చేయడానికి డ్రోన్‌లను కూడా మోహరించారు. ఆ నిఘా చివరకు పులిని బంధించడానికి దోహద పడింది.