Tirupati |
విధాత: తిరుపతిలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫోటోఫ్రేమ్ వర్క్స్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. స్థానికంగా ఉన్న ఇండ్లకు మంటలు వ్యాపించకుండా పోలీసులు మంటలను ఆర్పేస్తున్నారు. గోవిందరాజస్వామి ఆలయ రథం వైపు కూడా మంటలు రాకుండా అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది.
స్థానికంగా ఉన్న ఓ ఐదంస్తుల భవనంలోని ఓ అంతస్తులో ఫోటో ఫ్రేమ్ వర్క్స్ షాపు నిర్వహిస్తున్నారు. ఈ షాపులో కరెంట్ షాక్‌తో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సుమారు రూ. కోట్ల విలువ చేసే ఫోటోలు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి.
మరో వైపు భవనం ముందు ఉన్న ఐదు బైక్‌లు పూర్తిగా కాలిపోయాయి. ఇక షాపు ముందున్న ట్రాన్స్‌ఫార్మర్‌కు మంటలు వ్యాపించకుండా నిరోధించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ భవనంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
#WATCH | A fire broke out in a photo frames manufacturing unit located in a building, in Tirupati, today; no casualties were reported#AndhraPradesh pic.twitter.com/GUDR7TE9YH
— ANI (@ANI) June 16, 2023