Saket Gokhale | మోదీ.. జ‌వాన్లు అమ‌రులైన‌ రోజే సంబురాలా?: సాకేత్ గోఖలే

Saket Gokhale ఒక్క రోజు వాయిదా వేసుకోలేరా? సైనికుల త్యాగాల‌ను ప్రధాని ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారు ఎంపీ, టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే ఆగ్ర‌హం విధాత‌: ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వ్య‌వ‌హార‌శైలిపై రాజ్య‌స‌భ స‌భ్యుడు, భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమ‌ర సైనికుల శ‌వాల మీద ఓట్లు ఏరుకొనే త‌ర‌హాలో మోదీ తీరు ఉన్న‌ద‌ని సాకేత్ ఆరోపించారు. మ‌న దేశ సైనికులు […]

  • Publish Date - September 14, 2023 / 07:01 AM IST

Saket Gokhale

  • ఒక్క రోజు వాయిదా వేసుకోలేరా?
  • సైనికుల త్యాగాల‌ను ప్రధాని ఓటు
  • బ్యాంకుగా మార్చుకుంటున్నారు
  • ఎంపీ, టీఎంసీ జాతీయ అధికార
  • ప్రతినిధి సాకేత్ గోఖలే ఆగ్ర‌హం

విధాత‌: ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వ్య‌వ‌హార‌శైలిపై రాజ్య‌స‌భ స‌భ్యుడు, భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమ‌ర సైనికుల శ‌వాల మీద ఓట్లు ఏరుకొనే త‌ర‌హాలో మోదీ తీరు ఉన్న‌ద‌ని సాకేత్ ఆరోపించారు. మ‌న దేశ సైనికులు వీర‌మ‌ర‌ణం పొందిన‌ప్పుడు మోదీ సిగ్గు లేకుండా సంబురాలు చేసుకుంటున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్)లో సాకేత్ గురువారం ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.