Barwan
విధాత: డ్రగ్స్ కొనేందుకు రూ.500 అడిగితే అమ్మ ఇవ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని బర్వాని జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్నది. జిల్లాలోని ఖదన్ మోహల్లా ప్రాంతానికి చెందిన మజీద్ మన్సూరీ (21) డ్రగ్స్‌కు బానిసయ్యాడు.
డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు తల్లి రూ.500 ఇవ్వాలని అడిగాడు. కానీ, ఆమె డబ్బులు ఇవ్వలేదు. దీంతో ఇంట్లో గదిలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులు కుటుంబ సభ్యులకు అందజేశారు.
మజీద్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కుటుంబంలో తరచూ గొడవలు జరుతున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు. మజీద్ ఎండీఎంఏ డ్రగ్స్, ఇంజక్షన్స్ తీసుకొనేవాడని పోలీసుల విచారణలో తేలింది. రెండు రోజుల క్రితం మజీద్ రూ.1000తో రెండు డ్రగ్స్ ఇంజక్షన్లు కొన్నాడని తెలిపారు. మళ్లీ డ్రగ్స్ కొనేందుకు రూ.500 అడుగగా తల్లి ఇవ్వకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలో చాలా మంది యువకులు డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్ అమ్మకాలను నివారించాలని డిమాండ్ చేశారు. అయితే, ఇటీవల పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేశారు.