Viral Video | ఏం ధైర్యం రా బాబు.. తోక పట్టుకుని పాముతో ఆటాడిన బుడ్డోడు..
Viral Video | ఈ భూమ్మీద ప్రాణాంతకమైన, భయంకరమైన సరీసృపాలలో పాములు కూడా ఒకటి. అంతటి భయంకరమైన పాములను చూస్తే గజగజ వణికిపోతాం. పిల్లలు అయితే గట్టిగా ఏడ్చేస్తారు. అక్కడ్నుంచి పరుగెడుతారు. పాములు ప్రాణాంతకమైనవి అని తెలిసి కూడా కొందరు వాటితో ఆటలాడుతారు. నాగుపాము, పైథాన్‌లతో విన్యాసాలు చేస్తారు. ఆ విధంగానే ఓ బుడ్డోడు కూడా తన చేత్తో ఓ భారీ పామును పట్టుకున్నాడు. దాని తోకను పట్టుకున్న బుడ్డోడు.. దానిని ఆడించాడు. ఆ పామును ఇంట్లోకి […]

Viral Video | ఈ భూమ్మీద ప్రాణాంతకమైన, భయంకరమైన సరీసృపాలలో పాములు కూడా ఒకటి. అంతటి భయంకరమైన పాములను చూస్తే గజగజ వణికిపోతాం. పిల్లలు అయితే గట్టిగా ఏడ్చేస్తారు. అక్కడ్నుంచి పరుగెడుతారు. పాములు ప్రాణాంతకమైనవి అని తెలిసి కూడా కొందరు వాటితో ఆటలాడుతారు. నాగుపాము, పైథాన్‌లతో విన్యాసాలు చేస్తారు.
ఆ విధంగానే ఓ బుడ్డోడు కూడా తన చేత్తో ఓ భారీ పామును పట్టుకున్నాడు. దాని తోకను పట్టుకున్న బుడ్డోడు.. దానిని ఆడించాడు. ఆ పామును ఇంట్లోకి లాక్కెళ్లాడు. ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలు ఆ పామును చూసి భయపడిపోయారు. కొందరైతే లేచి పరుగులు పెట్టారు. ఇంట్లోకి వద్దు అని కేకలు వేశారు.
అంతలోనే ఓ పెద్దాయన పామును పట్టుకున్న బాలుడిని బయటకు లాక్కెళ్లాడు. అయితే ఈ పాము ఆ బుడ్డోడికి కానీ, ఇంట్లో ఉన్న ఇతరులకు ఎలాంటి హానీ కలిగించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను 17.7 మిలియన్ల మంది వీక్షించగా, 6 లక్షల మంది లైక్ చేశారు.
View this post on Instagram