TPCC | PCC ప్రధాన కార్యదర్శుల సంఖ్య పెంపు.. జోరందుకున్న పైరవీలు
TPCC విధాత: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శుల (TPCC) సంఖ్యను 84 నుండి 119 కి పెంచాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు థాక్రే తెలిపారు. ప్రధాన కార్యదర్శుల సంఖ్యను పెంచడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రధాన కార్యదర్శిని ఇన్చార్జిగా నియమించనున్నట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శుల నియామక ప్రక్రియను ఎఐసిసి కార్యదర్శులు పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అలాగే పిసిసి ప్రస్తుత ఉపాధ్యక్షులు 24మందికి తోడు మరో మూడు ఉపాధ్యక్ష […]
TPCC
విధాత: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శుల (TPCC) సంఖ్యను 84 నుండి 119 కి పెంచాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు థాక్రే తెలిపారు. ప్రధాన కార్యదర్శుల సంఖ్యను పెంచడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రధాన కార్యదర్శిని ఇన్చార్జిగా నియమించనున్నట్లు తెలిపారు.
ప్రధాన కార్యదర్శుల నియామక ప్రక్రియను ఎఐసిసి కార్యదర్శులు పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అలాగే పిసిసి ప్రస్తుత ఉపాధ్యక్షులు 24మందికి తోడు మరో మూడు ఉపాధ్యక్ష పదవులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
కాగా.. ప్రధాన కార్యదర్శుల సంఖ్యను పెంచడం , వారికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించనుండటంతో పాటు ఎన్నికల ఏడాది నేపథ్యంలో టీ. కాంగ్రెస్ లోని ముఖ్య నాయకులు అంతా తమ వర్గం వారికే ప్రధాన కార్యదర్శుల పదవులు దక్కేలా పైరవీలు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. కొత్తగా వచ్చే 35 ప్రధాన కార్యదర్శుల పదవుల భర్తీలో టీ. కాంగ్రెస్ లో అనూహ్యంగా పోటీ పెరిగింది.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram