Ramagundam: కమిషనరేట్‌లో ఒకేసారి 20 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం
శనివారం ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ రెమా రాజేశ్వరి విధాత బ్యూరో, కరీంనగర్: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒకేసారి 20 మంది సబ్ ఇన్స్పెక్టర్లకు స్థాన చలనం కలిగింది. 20 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ రెమా రాజేశ్వరి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం సిఎస్ బిలో పనిచేస్తున్న కే.నరేష్ కన్నెపల్లి పిఎస్ కు, లక్షెట్టిపేటలో పనిచేస్తున్న కే.ప్రసాద్ దండేపల్లి, నీల్వాయిలో పనిచేస్తున్న జి.నరేష్ గురిజాల, నన్నెల్ లో పనిచేస్తున్న ఎస్.రాజశేఖర్ […]

- శనివారం ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ రెమా రాజేశ్వరి
విధాత బ్యూరో, కరీంనగర్: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒకేసారి 20 మంది సబ్ ఇన్స్పెక్టర్లకు స్థాన చలనం కలిగింది. 20 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ రెమా రాజేశ్వరి
శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
రామగుండం సిఎస్ బిలో పనిచేస్తున్న కే.నరేష్ కన్నెపల్లి పిఎస్ కు, లక్షెట్టిపేటలో పనిచేస్తున్న కే.ప్రసాద్ దండేపల్లి, నీల్వాయిలో పనిచేస్తున్న జి.నరేష్ గురిజాల, నన్నెల్ లో పనిచేస్తున్న ఎస్.రాజశేఖర్ తాండూరు, గోదావరిఖని వన్ టౌన్ లో పనిచేస్తున్న సుబ్బారావు నీల్వాయికి బదిలీ అయ్యారు. మందమర్రిలో పనిచేస్తున్న కే మహేందర్ భీమిని, హాజీపూర్ లో పనిచేస్తున్న జి ఉదయ్ కిరణ్ కొమరం భీం ఆసిఫాబాద్, భీమిని లో పనిచేస్తున్న ఎస్ వెంకటేష్ గోదావరిఖని వన్ టౌన్, కన్నేపల్లిలో పనిచేస్తున్న జి సురేష్ వర్మ మంచిర్యాల, మంచిర్యాల టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఎ.మధుసూదన్ రావు బసంత్ నగర్ బదిలీ అయ్యారు.
గోదావరిఖని ఏసీపీ కార్యాలయంలో పనిచేస్తున్న టి సత్యనారాయణ ధర్మారం, దండేపల్లి లో పనిచేస్తున్న ఎం సాంబమూర్తి మంచిర్యాల, ధర్మారంలో పనిచేస్తున్న ఎం శ్రీనివాస్ రామగుండం సిసిఎస్ కు బదిలీ అయ్యారు. మంచిర్యాలలో పనిచేస్తున్న జి హరి శేఖర్ రామగుండం సిఎస్ బికి, గోదావరిఖని వన్ టౌన్ లో పనిచేస్తున్న జె నరేష్ కుమార్ హాజీపూర్, గురిజాల లో పనిచేస్తున్న జి రాజశేఖర్ మంచిర్యాల సిసిఎస్, తాండూరు లో పనిచేస్తున్న బి సమ్మయ్య రామగుండం సిసిఎస్, బసంత్ నగర్ లో పనిచేస్తున్న టి శ్రీనివాస్ రామగుండం పిసిఆర్ కు బదిలీ అయ్యారు.