Triumph Scrambler Bike | సరికొత్త లగ్జరీ బైక్‌ను భారత్‌లో లాంచ్ చేసిన ట్రయంప్.. ధర ఎంతంటే..?
ప్రముఖ బ్రిటిష్ మోటార్ సైకిల్ కంపెనీ ట్రయంప్ భారత్‌లోకి కొత్తగా లగ్జరీ బైక్‌క్‌ను తీసుకువచ్చింది. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్ బైక్‌ను లాంచ్ చేసింది
Triumph Scrambler Bike | ప్రముఖ బ్రిటిష్ మోటార్ సైకిల్ కంపెనీ ట్రయంప్ భారత్‌లోకి కొత్తగా లగ్జరీ బైక్‌క్‌ను తీసుకువచ్చింది. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్ బైక్‌ను లాంచ్ చేసింది. ఈ బైక్ 1,200 సీసీ ప్యారలాల్ ట్విన్ ఇంజిన్‌తో వస్తుంది. 90 హెచ్‌పీ పవర్‌ని, 110 ఎన్ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లోని ట్యూబ్‌లెస్ టైర్స్ కోసం సరికొత్త క్రాస్ స్పోక్డ్ రిమ్స్‌తో వస్తుంది. బైక్ సీట్ హైట్ 820ఎంఎం కాగా.. దీన్ని 795 ఎంఎంకి తగ్గించుకునే అవకాశం సైతం ఉన్నది. రీయర్ ప్రీలోడ్ అడ్జెస్ట్మెంట్స్ వస్తాయి. యాక్సియల్లీ మౌంటెడ్ నిస్సిన్ కాలిపర్స్‌తో కూడిన బ్రేకింగ్ సిస్టమ్‌ను కంపెనీ ఇచ్చింది. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్‌లో రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్ రోడ్, రైడర్ కాన్ఫిగరెబుల్ అనే ఐదు రైడింగ్స్ ఉన్నాయి.
ఐఎంయూతో కూడిన ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ తదితర సేఫ్టీ ఫీచర్స్ సైతం ఉన్నాయి. బైక్‌లోని రౌండ్ డాష్ ట్రయంఫ్ 660 సీసీ బైక్స్‌ని పోలి ఉంటుంది. టర్న్ బై టర్న్ నేవిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్‌వి ఆప్షనల్‌గా కంపెనీ ఇస్తున్నది. స్క్రాంబ్లర్ ఎక్స్‌కి 70 అఫీషియల్ యాక్సెసరీస్‌ని సైతం ఇస్తున్నది. ఇక ఈ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్ ఎక్స్‌షోరూం ధర రూ.11.83 లక్షలు. స్క్రాంబ్లర్ 1200 ఎక్స్‌సీ కన్నా రూ.1.10 లక్షల ధర అధికంగా ఉన్నది. మంచి లగ్జరీ బైక్ కొనాలని భావించే స్క్రాంబ్లర్ 1200 ఎక్స్ కొత్త ఆప్షన్ అవుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బైక్ హార్లే-డేవిడ్‌సన్ ఐరన్ 883కి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram