True Caller | స్పామ్‌ కాల్స్‌తో విసిగిపోతున్నారా..? సరికొత్త ఏఐ ఫీచర్‌ను పరిచయం చేసిన ట్రూ కాలర్‌..!

True Caller | ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ భాగంగా మారింది. చేతిలో ఫోన్‌ లేనిదే గడియ గడవని పరిస్థితి నెలకొన్నది. అయితే, ఇటీవల కాలం మార్కెటింగ్‌ సంస్థల నుంచి కాల్స్‌ ఎక్కువయ్యాయి. తమ ఉత్పత్తులకు సంబంధించి ప్రచారం కోసం ఫోన్లు చేస్తూ వస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ ఉన్నా.. బిజీబిజీగా ఉన్న సమయంలో మార్కెటింగ్‌ కాల్స్‌ వస్తున్నాయి. పలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా క్రెడిట్‌కార్డు […]

True Caller | స్పామ్‌ కాల్స్‌తో విసిగిపోతున్నారా..? సరికొత్త ఏఐ ఫీచర్‌ను పరిచయం చేసిన ట్రూ కాలర్‌..!

True Caller | ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ భాగంగా మారింది. చేతిలో ఫోన్‌ లేనిదే గడియ గడవని పరిస్థితి నెలకొన్నది. అయితే, ఇటీవల కాలం మార్కెటింగ్‌ సంస్థల నుంచి కాల్స్‌ ఎక్కువయ్యాయి. తమ ఉత్పత్తులకు సంబంధించి ప్రచారం కోసం ఫోన్లు చేస్తూ వస్తున్నారు.

ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ ఉన్నా.. బిజీబిజీగా ఉన్న సమయంలో మార్కెటింగ్‌ కాల్స్‌ వస్తున్నాయి. పలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా క్రెడిట్‌కార్డు ఇస్తున్నాం..! మరొకరు ఫోన్‌ చేసి పలానా బీమా పాలసీ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మీరు ఏమైనా పాలసీలు తీసుకుంటారా? ఇలా నిత్యం చాలా మందికి ఫోన్లు వస్తుంటాయి.

అయితే, ఫోన్‌ చేసేది ఎవరో తెలియకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లిఫ్ట్‌ చేయడంతో వారు చెప్పేదంతా వింటూ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన పరిస్థితి. అదే సమయంలో సందిట్లో సడేమియాలా సైబర్‌ నేరగాళ్లు ఫోన్లు చేస్తూ జనాల ఖాతాలను లూటీ చేస్తున్నారు. ఇక అలాంటి వారి కోసం ట్రూ కాలర్‌ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.

స్పామ్ కాల్స్‌ను అడ్డుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో పని చేస్తుది. అయితే, ఈ ఫీచర్‌ కోసం పేమెంట్‌ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ట్రూ కాలర్ ప్రీమియం సబ్ స్క్రైబర్లకు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఏఐ ఆధారిత కాల్ స్క్రీనింగ్ ఫీచర్‌లో స్పామ్ కాల్స్‌ను అడ్డుకోవడంతో పాటు కాలర్‌ ఉద్దేశాన్ని సైతం ముదు తెలుసుకునే సదుపాయం ఉంటుందని పేర్కొంది.

ఇక యూజర్‌ తనకు వచ్చే కాల్స్‌ను మాట్లాడాలా? వద్దా అనేది నిర్ణయించుకోవచ్చని స్పష్టం చేసింది. యూజర్ భద్రత, వ్యక్తిగత వివరాలను సైతం గోప్యంగా ఉంచుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

మొదటి 14 రోజులు ఈ ఫీచర్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చని, ఇక రెగ్యులర్‌గా వాడుకునేందుకు ట్రూ కాలర్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలని చెప్పింది. ఇందుకు మొదటి నెలలో రూ.99, ఆ తర్వాత 149 చొప్పున నెలనెలకు చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.