New Sim Card Rules | స్పామ్ కాల్స్ ఇక చెక్.. కొత్త నిబంధనలు తీసుకువచ్చిన ట్రాయ్..!
New Sim Card Rules | టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ రూల్స్ ప్రకారం టెలికం కంపెనీలు ఏయే ప్రాంతాల్లో తమ నెట్‌వర్క్ అందుబాటులో ఉందో వివరాలు అందించాల్సిందే. అదే సమయంలో స్పామ్ కాల్స్‌ని అరికట్టేందుకు కొత్తగా చర్యలు తీసుకోవాల్సి ఉన్నది.

New Sim Card Rules | టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ రూల్స్ ప్రకారం టెలికం కంపెనీలు ఏయే ప్రాంతాల్లో తమ నెట్‌వర్క్ అందుబాటులో ఉందో వివరాలు అందించాల్సిందే. అదే సమయంలో స్పామ్ కాల్స్‌ని అరికట్టేందుకు కొత్తగా చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. వినియోగదారుల సౌలభ్యం, సౌకర్యం దృష్టిలో ఉంచుకుని ట్రాయ్ సిమ్ కార్డు నిబంధనలు మారుతూ వస్తుంది. ఇందులో భాగంగా ట్రాయ్ మరో నిబంధన తీసుకువచ్చింది. ఈ నిబంధన అమలులోకి వస్తే.. యూజర్లకు ఏ ప్రాంతంలో ఏ నెట్క్‌వర్క్ ఉందో సులభంగా తెలియనున్నది. తగిన వివరాలు అందించాల్సింగా ట్రాయ్ ఇప్పటికే వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, బీఎస్‌ఎస్‌ఎల్ సంస్థలను కోరింది. ఒకే సంస్థ వేర్వేరు నెట్‌వర్క్ అందిస్తుంది.
5జీ నెట్‌వర్క్ ఒకే ప్రాంతంలో ఉండి.. మరో ప్రాంతంలో ఉండకపోవచ్చు. మరో ప్రాంతంలో వేరే సంస్థ నెట్‌వర్క్ ఉండేందుకు అవకాశం ఉంది. సంస్థ ఒకటే అయినా ప్రాంతాన్ని బట్టి 5జీ, 4జీ అందుబాటులో ఉంటుంది. ఈ సందిగ్దతను ట్రాయ్ తొలగించే ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగా కొత్త నిబంధన తీసుకువస్తున్నది. టెలికం కంపెనీలు నెట్‌వర్క్ సంబంధిత సమాచారాన్ని పూర్తిగా తమ వెబ్‌సైట్స్‌లో ప్రస్తావించాలి. దాంతో యూజర్లు సులభంగా తెలుసుకోగలుగుతారు. మీ ప్రాంతంలో ఎయిర్‌టెల్ 5జీ ఉందో లేదో తెలుసుకోవాలంటే నేరుగా ఆ కంపెనీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి లొకేషన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెట్‌వర్క్‌కు సంబంధించి సమాచారం ఇలా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అన్ని నెట్‌వర్క్ యూజర్లు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య స్పామ్ కాల్స్. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ట్రాయ్ హెచ్చరించింది.