Elephant | కేర‌ళ అడ‌వుల్లో తొండెం లేని ఏనుగు ప్ర‌త్య‌క్షం..

Elephant | ఏనుగులు అన‌గానే భారీ తొండెం గుర్తుకు వ‌స్తుంది. దాదాపు 8 అడుగుల పొడ‌వుండే తొండెం లేకుండా ఓ ఏనుగు క‌నిపించింది. కేర‌ళ అడ‌వుల్లో ప్ర‌త్య‌క్ష‌మైన ఈ ఏనుగు ప్ర‌స్తుతం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వివ‌రాల్లోకి వెళ్తే.. కేర‌ళ‌లోని అతిరప్పిల్లిలోని ద‌ట్ట‌మైన అడ‌వుల్లో అట‌వీ అధికారులు తొండెం లేని ఏనుగు పిల్ల‌ను గుర్తించారు. ఏనుగు గుంపుల మ‌ధ్య‌లో సంచ‌రిస్తున్న తొండెం లేని ఈ పిల్ల ఏనుగు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచింది. కేర‌ళ‌, త‌మిళ‌నాడు మ‌ధ్య సంచ‌రిస్తున్న […]

Elephant | కేర‌ళ అడ‌వుల్లో తొండెం లేని ఏనుగు ప్ర‌త్య‌క్షం..

Elephant | ఏనుగులు అన‌గానే భారీ తొండెం గుర్తుకు వ‌స్తుంది. దాదాపు 8 అడుగుల పొడ‌వుండే తొండెం లేకుండా ఓ ఏనుగు క‌నిపించింది. కేర‌ళ అడ‌వుల్లో ప్ర‌త్య‌క్ష‌మైన ఈ ఏనుగు ప్ర‌స్తుతం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కేర‌ళ‌లోని అతిరప్పిల్లిలోని ద‌ట్ట‌మైన అడ‌వుల్లో అట‌వీ అధికారులు తొండెం లేని ఏనుగు పిల్ల‌ను గుర్తించారు. ఏనుగు గుంపుల మ‌ధ్య‌లో సంచ‌రిస్తున్న తొండెం లేని ఈ పిల్ల ఏనుగు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచింది. కేర‌ళ‌, త‌మిళ‌నాడు మ‌ధ్య సంచ‌రిస్తున్న ఏనుగుల గుంపును ప‌ర్య‌వేక్షిస్తున్న అధికారులు ఆ పిల్ల ఏనుగును చూసి షాకయ్యారు. ఆ ఏనుగు ఆరోగ్య క‌ద‌లిక‌ల‌ను నిశితంగా ప‌రిశీలించారు.

అయితే నీటిని తాగేందుకైనా, ఆహార ప‌దార్థాల‌ను తిన‌డానికైనా ఏనుగుకు తొండెం చాలా స‌హాయ‌ ప‌డుతుంది. ఈ పిల్ల ఏనుగుకు తొండెం లేక‌పోవ‌డంతో.. దాని మ‌నుగ‌డ విష‌యంలో అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ఏనుగు ఆరోగ్యంగా ఉంద‌ని, సంర‌క్ష‌ణ శిబిరానికి త‌ర‌లించాల్సిన అవ‌స‌రం లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. తొండెం పైభాగంలో కోత గుర్తు ఉందని, అది పుట్టుకతో వచ్చిందా, ఏదైనా ప్రమాదం జరిగిందా తెలియాల్సి ఉందని అటవీ అధికారులు తెలిపారు.

ఇక ఏనుగు తొండెంలో దాదాపు 40 వేల కండ‌రాలు ఉంటాయ‌ని నిపుణులు పేర్కొన్నారు. తొండెం స‌హాయంతో ఈజీగా 300 కేజీల బ‌రువు వ‌ర‌కు ఎత్త‌గ‌ల‌ద‌ట‌. పెద్ద దుంగలను సులువుగా తరలిస్తుంది. అంతేకాదు కార్లు, ఇతర వాహనాలను అవలీలగా ఎత్తిపడేస్తుంది. అలాంటి తొండం ఏనుగుకు లేకపోతే ఎలా ఉంటుంది? అసలు ఏనుగుగా గుర్తించగలగుతామా?