KTR | వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కుట్రలను ఆపండి.. కేంద్రానికి కేటీఆర్‌ బహిరంగ లేఖ

KTR | ఏపీలోని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కుట్రలను ఆపాలని, కార్పొరేట్‌ మిత్రులను కట్టబెట్టే పన్నాగాలను మానాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మోదీ నేతృత్వంలోని కేంద్రానికి కేటీఆర్‌ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరుతో స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ మిత్రులకు రూ.12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ […]

KTR | వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కుట్రలను ఆపండి.. కేంద్రానికి కేటీఆర్‌ బహిరంగ లేఖ

KTR | ఏపీలోని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కుట్రలను ఆపాలని, కార్పొరేట్‌ మిత్రులను కట్టబెట్టే పన్నాగాలను మానాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మోదీ నేతృత్వంలోని కేంద్రానికి కేటీఆర్‌ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరుతో స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ మిత్రులకు రూ.12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధాని మోదీకి.. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై ఇదే ఔదార్యం ఎందుకు లేదని నిలదీశారు.

ప్రభుత్వం ప్రభుత్వం వర్కింగ్ కాపిటల్ కోసం ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వైజాగ్ స్టీల్ నుంచి ఉత్పత్తులు కొనాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలీనాన్ని పరిశీలించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన మేరకు కనీసం రూ.5వేలకోట్లను వెంటనే కేటాయించాలన్నారు. గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానులుగా ఉన్న సమయంలో ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చిందని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రూ.లక్షన్నర కోట్ల విలువ కలిగిన స్టీల్ ప్లాంట్‌ను అప్పనంగా ప్రవేట్‌పరం చేసే కుట్రలను కేంద్రం ఆపాలని హితవు పలికారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విడుదల చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో చేసుకోబోయే ఒప్పందం విషయంలో ఎలాంటి నిర్ధిష్ట నిబంధనలు లేవని, ఇది ముడి సరుకులకు మూలధనం పేరిట స్టీల్ ప్లాంట్‌ను తమ అనుకూల ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్రగా కేటీఆర్‌ అభివర్ణించారు. వైజాగ్ ఉక్కు తెలుగు వారి హక్కు అని, దీన్ని కాపాడుకోవడం తెలుగువారి బాధ్యత అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు సంఘీభావం తెలపాలని ఆ పార్టీ బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్‌కు కేటీఆర్ సూచించారు. కేంద్రం కుట్ర పూరితంగా చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను నిలువరించేందుకు లక్షలాది పీఎస్‌యూ కార్మికులు బీఆర్‌ఎస్‌తో కలిసి రావాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.