TSUTF | జోరు వానలో DSC దిగ్భంధనం

TSUTF KGBV, URS ఉద్యోగుల నిరసన విధాతః సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, KGBV, URS, సమగ్ర శిక్షా విభాగం ఉద్యోగులందరికి బేసిక్ పే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ TSUTF రాష్ట్ర కమిటీ గురువారం నిర్వహించిన చలో SPD ఆఫీస్ ఉద్రిక్తంగా మారింది. ఐదు గంటల పాటు KGBV, URS ఉద్యోగులు జోరు వానను సైతం లెక్కచేయకుండా DSC దిగ్బంధనం చేసి తమ నిరసన తెలిపారు. బేసిక్ […]

  • Publish Date - July 20, 2023 / 12:30 AM IST

TSUTF

  • KGBV, URS ఉద్యోగుల నిరసన

విధాతః సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, KGBV, URS, సమగ్ర శిక్షా విభాగం ఉద్యోగులందరికి బేసిక్ పే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ TSUTF రాష్ట్ర కమిటీ గురువారం నిర్వహించిన చలో SPD ఆఫీస్ ఉద్రిక్తంగా మారింది. ఐదు గంటల పాటు KGBV, URS ఉద్యోగులు జోరు వానను సైతం లెక్కచేయకుండా DSC దిగ్బంధనం చేసి తమ నిరసన తెలిపారు. బేసిక్ పే ఇచ్చేదాక కదిలేది లేదని భీష్మించిన ఉద్యోగులు వర్షంలో తమ నిరసన కొనసాగించారు.


అనంతరం MLC నర్సిరెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం సచివాలయంలోకి వెళ్ళి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. విద్యాశాఖ అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె. జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ దుర్గా భవాని, కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, కార్యదర్శులు వి శాంతికుమారి, జి నాగమణి, వై. జ్ఞానమంజరి, ఎ వెంకట్, ఎస్. రవి ప్రసాద్ గౌడ్, సింహాచలం, విశాలాక్షి, రేణుక, సుమన తదితరులు పాల్గొన్నారు.

Latest News